టాలీవుడ్‌ నటుడు పృథ్వీరాజ్ అరెస్ట్‌ ?

-

టాలీవుడ్‌ సీనియ‌ర్ న‌టుడు పృథ్వీరాజ్ అరెస్ట్ అయినట్లు వార్తలు నిన్నటి నుంచి వస్తున్నాయి. అయితే.. ఈ వార్తలపై టాలీవుడ్‌ సీనియ‌ర్ న‌టుడు పృథ్వీరాజ్ క్లారిటీ ఇచ్చారు. అలాగే… నాన్ బెయిల‌బుల్ వారెంట్ అంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తనను ఎవరూ అరెస్ట్ చేయ‌లేద‌ని స్పష్టం చేశారు.

త‌న‌పై త‌ప్పుడు వార్త‌లు రాసిన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటానని పృథ్వీరాజ్ చెప్పారు. ఇది కుటుంబ విష‌యమని.. తెలుసుకోకుండా తప్పుడు వార్తలు రాయొద్దని కోరారు. తన భార్యకు ఇవ్వాల్సిన భ‌ర‌ణంలో ఇప్ప‌టివ‌ర‌కు రూపాయి కూడా ఆపలేదని తెలిపారు.

కాగా,  మనోవర్తి చెల్లింపుపై ఘటనలో కోర్టును ఆశ్రయించారట పృథ్వి భార్య శ్రీలక్ష్మి. ఈ సందర్భంగా టాలీవుడ్‌ సినీ నటుడు పృథ్వీరాజ్ భార్య శ్రీ లక్ష్మీ వేసిన కేసును విచారించిందట కోర్టు. ఇక పెండింగ్ లో ఉన్న మనోవర్తి బకాయి చెల్లించాలని టాలీవుడ్‌ సినీ నటుడు పృథ్వీరాజ్ కు కోర్టు ఆదేశాలు ఇచ్చిందని వార్తలు వచ్చాయి. కానీ టాలీవుడ్‌ సినీ నటుడు పృథ్వీరాజ్..ఈ వార్తలను ఖండించారు.

Read more RELATED
Recommended to you

Latest news