శరత్ బాబు: తన నటనతో టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శరత్ బాబు.ఎందరో స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గానే ఉందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో శరత్ బాబు చిన్ననాటి స్నేహితుడు అతని కుటుంబం గురించి వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో స్థిరపడిన శరత్ బాబు కుటుంబ సొంతూరు కాదట. కాన్పూర్ నుంచి వలస వచ్చారని చిన్నానాటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డారంటూ తెలిపారు.
“శరత్ బాబు కుటుంబం కాన్పూర్ నుంచి వచ్చారు. ఇక్కడ రైల్వే క్యాంటీన్ తీసుకున్నారు. ఆ తరవాత హోటల్ అద్దెకు తీసుకుని, దాన్నే కొనుగోలు చేశారు. ఆ కుటుంబం మొత్తం ఆ హోటల్ మీదే ఆధారపడి బతికేది. శరత్ బాబు కుటుంబం మొత్తం 14 మంది సభ్యులు. చాలా కష్టాలు పడ్డారు. చిన్న ఇల్లు కావడంతో చదువుకోవడానికి, రాత్రిపూట పడుకోవడానికి కూడా ఇబ్బంది పడేవారు. రాత్రివేళల్లో మా ఇంటి మెట్ల దగ్గర కూర్చొని వారంతా చదువుకునేవారు.

శరత్ బాబు తల్లి లావుగా ఉండేవారు. పనిచేయలేకపోయేవారు. అలాంటి సమయంలో నా ఇల్లు కావాలని అడిగారు. నేను వాళ్లకు ఇల్లు అమ్మాను.. ఆమదాలవలసలో హోటల్ నడుపుతున్న సమయంలోనే శరత్ బాబు నాటకాలు వేస్తుండేవారని.. ఆ సమయంలో ‘జి.ఆనంద్ అనే సినీ గాయకుడు ఓ నాటకంలో శరత్ బాబును చూశారు. ఆయన శరత్ బాబును మద్రాసు తీసుకెళ్లి కొంత మందికి పరిచయం చేశారు. సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాక ఆడపిల్లల పెళ్లిళ్లకు డబ్బు పంపడం, ఇళ్లులు కొనడం చేశారు. ఆయన తమ్ముడు ఖాళీగా ఉండటంతో నాకు చెప్పి నాతో జాయింట్ బిజినెస్ చేయించారు. ఆయనే డబ్బులు ఇచ్చారు..
శరత్ బాబు మద్రాసులో ఉన్నప్పుడు ఆయన తమ్ముడు తో పాటు నేను వెళ్లి అతని కలుస్తూ ఉండేవాడినని తెలిపిన సత్యనారాయణ.. ఎంత ఎదిగిన సొంత ఊరుని మాత్రం శరత్ బాబు మర్చిపోలేదని తెలిపారు. సొంత ఊరిలో గుడి బాగోగులు చూడటానికి ఎప్పటికప్పుడు డబ్బులు పంపిస్తూ ఉండేవారని కరోనాకు ముందు కూడా వచ్చి తన ఊరిని చూసుకొని వెళ్లారు అంటూ తెలిపారు.