పెళ్లిపీటలెక్కబోతున్న రాజ్ తరుణ్.. అమ్మాయి ఎవరో తెలుసా?

-

రాజ్ తరుణ్ సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుతం ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే హీరోయిన్. రాజ్ తరుణ్ ఇంతకుముందు వచ్చిన సినిమా లవర్.. అట్టర్ ప్లాఫ్ అయింది.

అష్టాచమ్మా.. సినిమాతో వెండితెరపై తెరంగేట్రం చేసిన నటుడు రాజ్ తరుణ్. ఒక్క సినిమాతోనే తెలుగులో నాచురల్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత ఆపర్లు తన్నుకుంటూ వచ్చాయి. ఒకేసారి స్టార్ హీరో రేంజ్. అంతలోనే సినిమాలు వరుసగా ప్లాఫ్ అవడంతో ఒక్కసారిగా పడిపోయాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

Tollywood hero raj tarun to get married soon

అయితే.. రాజ్ తరుణ్ గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆయన త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నాడట. అవును.. పెళ్లి చేసుకుంటున్నాడట. అవునా.. ఇంతకీ రాజ్ తరుణ్ ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు అంటారా?

అది మాత్రం సస్పెన్స్. హా.. తను చేసుకోబోయే అమ్మాయి మాత్రం ఎవరో చెప్పలేదు రాజ్ తరుణ్. తన పెళ్లి విషయాన్ని రాజ్ తరుణే బయటపెట్టాడు. తన పెళ్లి ఎవరితో అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా పెట్టిన రాజ్ తరుణ్.. తన అభిమానులకు మాత్రం సర్ ప్రైజ్ న్యూస్ అందించాడు.

ఇంతకీ రాజ్ తరుణ్.. ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడా? లేక.. తన బంధువుల అమ్మాయా? లేక ఎవరినైనా ప్రేమించాడా? ఇంతకీ ఎవరా అమ్మాయి.. అని తెలుసుకునే పనిలో పడ్డారు సినీ అభిమానులు.

ఇక.. రాజ్ తరుణ్ సినిమాల విషయానికి వస్తే… ప్రస్తుతం ఇద్దరి లోకం ఒకటే అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే హీరోయిన్. రాజ్ తరుణ్ ఇంతకుముందు వచ్చిన సినిమా లవర్.. అట్టర్ ప్లాఫ్ అయింది. అదొక్కటే కాదు.. అంతకుముందు వచ్చిన చాలా సినిమాలు డిజాస్టర్ కావడంతో.. కాస్త ఆచితూచి అడుగేస్తున్నాడు రాజ్ తరుణ్.

Read more RELATED
Recommended to you

Latest news