బన్నీలుక్ కి టాలీవుడ్ జై కొట్టింది…!

-

సినిమాలో వైవిధ్యం ఉంటే నేడు ఎవరు అయినా ఆదరించే పరిస్థితి ఉంటుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. రెగ్యులర్ సినిమాలను బొంబాయి అని అంటున్నారు అభిమానులు,ప్రేక్షకులు. ఏ స్టార్ హీరో అయినా సరే వైవిధ్యంగా ఉండే విధంగానే సినిమాలను తీస్తే మంచిది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే మన తెలుగులో హీరోలు మాత్రం కథ ప్రయోగాత్మకంగా ఉంటే సినిమా చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు.

కాని ప్రేక్షకుల ఆలోచనకు తగిన విధంగా సినిమా చేయడం ఇది చాలా అవసరం. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప అంటే టైటిల్ తో సినిమా లాంచ్ అయింది. ఈ టైటిల్ తో పాటుగా సినిమాను ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఈ లుక్ లో బన్నీ చంపేసాడు… అవును ఆ లుక్ లో తన ఇమేజ్ ని పక్కన పెట్టి కనిపించాడు.  ఎర్ర చందనం దుంగలు పక్కన ఉన్నాయి. అతను పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు.

ఇక కింద కూర్చుని ఉన్నాడు. మొహం అంతా దుమ్ము పట్టి నల్లగా కనిపించాడు బన్నీ. ఇక జుట్టు కూడా ఏ మాత్రం బాగా లేదు. అతనికి స్టైలిష్ స్టార్ గా గుర్తింపు ఉంది టాలీవుడ్ లో. అలాంటి హీరో ఇలాంటి లుక్ లో కనపడటం చూసి షాక్ అయ్యారు ఫాన్స్. ఇక టాలీవుడ్ లో కూడా ఈ లుక్ హాట్ టాపిక్. ఇప్పుడు టాలీవుడ్ జనాలు అందరూ బన్నీ కి జై కొడుతున్నారు. సినిమా హిట్ అవ్వాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news