‘ఉత్తర’ మూవీ రివ్యూ : సినిమాకు అతనే హైలైట్…!

-

మూవీ రివ్యూ : ‘ఉత్తర’

కొద్దిరోజులుగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఎక్కువగా యువత రావడం, లో బడ్జెట్ తో మంచి కథాకథనాలతో ఆసక్తికరంగా సినిమాలు తెరకెక్కడం, అలానే పెద్ద సినిమాలతో పోలిస్తే అటువంటి లో బడ్జెట్ సినిమాలే ఎక్కువగా సక్సెస్ సాదించడం జరుగుతోంది. అదే కోవలో చిన్న సినిమాగా ప్రేక్షకుల అంచనాల మధ్య నేడు రిలీజ్ అయిన సినిమా ఉత్తర. యువ దర్శకుడు తిరుపతి ఎస్ ఆర్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీరామ్, కారణ్య కత్రిన్ హీరో, హీరోయిన్లుగా నటించగా, సురేష్ బి సంగీతాన్ని, చరణ్ బాబు ఫోటోగ్రఫిని అందించగా పలు సినిమాలకు ఎడిటర్ గా పనిచేసిన నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ అందించారు. ఇక ఈ సినిమా విశ్లేషణ ఇప్పుడు చూద్దాం.

 

కథ :

కథ పరంగా అశోక్ అనే యువకుడు తొలిచూపులోనే స్వాతి అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే ఆర్ధికంగా అతనికి సమస్యలు ఉడడంతో, హీరోయిన్ ని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ ని నడిపే స్థోమత లేకపోవడంతో కొంత ఆలోచనలో పడతాడు. అయితే అదే సమయంలో అతడికి ఉత్తర అనే నిధి విషయం తెలియడం జరుగుతుంది. కానీ ఆ నిధిని దక్కించుకోవడం అంత సులభం కాదని అతడికి తెలుస్తుంది. అయితే అదే సందర్భంలో ఊరి పెద్దయిన రుద్రయ్యతో కలసి నడవాల్సిన పరిస్థితి అతడికి ఏర్పడుతుంది. కాగా అతడు రుద్రయ్యతో ఎందుకు కలిసాడు, అతడికి నిధి దక్కుతుందా, అసలు స్వాతిని అశోక్, పెళ్లి చేసుకుంటాడా, లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ :

ఒక మంచి హృద్యమైన లవ్ స్టోరీ గా నిధి వేటలో భాగంగా పలు సస్పెన్స్ అంశాలతో దర్శకుడు తిరుపతి ఈ సినిమాని తెరకెక్కించిన విధానం బాగుంది. సినిమా లో మొదటి అర్ధభాగం మంచి కామెడీ, లవ్, సస్పెన్స్ అంశాలతో సాగగడం, అలానే ఇంటర్వెల్ లో ఆసక్తికరమైన ట్విస్ట్ రావడంతో ప్రేక్షకులకు సెకండ్ హాఫ్ పై మరింత ఇంటరెస్ట్ ఏర్పడుతుంది. ఒకింత మెల్లగా ఆరంభం అయిన సెకండ్ హాఫ్, అక్కడక్కడా వచ్చే కొన్ని సస్పెన్స్ సీన్స్ తో ప్రేక్షకుడికి కథపై కొద్దీ కొద్దిగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక క్లైమాక్స్ కూడా ఎంతో ఇంటరెస్టింగ్ గా సాగుతుంధి. ఇక సినిమాలో ముందుగా హీరో శ్రీరామ్ నటన గురించి మాట్లాడుకుంటే, కొన్ని సీన్స్ లో అతడు ఎంతో పరిణితి చెందిన నటుడివలె పెర్ఫార్మన్స్ చేసాడు అనే చెప్పాలి. కీలకమైన జైలు సీన్స్ లో అతడి నటన మరింత ఆకట్టుకుంటుంది. అలానే హీరోయిన్ కత్రిన్ అందం, మరియు అభినయంతో మంచి మార్కులు సంపాదించగా, ఊరి పెద్దగా అజయ్ ఘోష్, అలానే కమెడియన్ టిల్లు కామెడీ పెర్ఫార్మన్స్ సినిమాకు మరింత ప్లస్ అని చెప్పాలి. విజువల్ గా కూడా ఆకట్టుకున్న ఈ సినిమాలో సాంగ్స్, కీలక సీన్స్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ఆకర్షణ అనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్ :

కథ, ఆకట్టుకునే కథనం
హీరో శ్రీరామ్ నటన
సాంకేతిక అంశాలు
కామెడీ

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడా కొంత ల్యాగ్ సీన్స్

ముగింపు :

ఆసక్తికరమైన కథ, కథనాలతో తెరకెక్కిన ఈ ఉత్తర సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు తిరుపతి తెరకెక్కించారు అనే చెప్పాలి. కామెడీ, లవ్ సీన్స్, సస్పెన్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, ఇలా దాదాపుగా అన్ని అంశాలు కూడా ప్రేక్షకుడికి చేరువ అయిన ఈ సినిమాను ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ గా చెప్పవచ్చు. మంచి థ్రిల్లింగ్ సస్పెన్స్ అంశాలతో పాటు సాంకేతికంగా కూడా ఆకట్టుకున్న ఈ సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పవచ్చు…!!

రేటింగ్ : 2.75/5

Read more RELATED
Recommended to you

Latest news