టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్ల సినిమాలకు ఉండే క్రేజే వేరు. సంక్రాంతికి సినిమా వస్తే హిట్టు… ప్లాపుతో సంబంధం లేకుండా మంచి వసూళ్లు వస్తాయి. ఈ సంక్రాంతికి వచ్చిన రామ్‌చరణ్ వినయ విధేయ రామ ప్లాప్ అయినా కూడా రూ.60 కోట్ల షేర్ రాబట్టింది. అందుకే సంక్రాంతికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలోనే 2020 సంక్రాంతి బెర్తులు ఒకొక్కటిగా ఫిల్ అవుతున్నాయి. మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తోన్న `సరిలేరు నీకెవ్వరు` సంక్రాంతికే విడుదల అవుతోంది.
మరోవైపు అల్లు అర్జున్ `అల వైకుంఠపురములో` కూడా పండక్కే వస్తోంది. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోల మధ్య నందమూరి హీరో కళ్యాణ్‌రామ్ కూడా తన సినిమాను సంక్రాంతి బరిలో దించేందుకు రెడీ అయిపోతున్నాడు. కళ్యాణ్‌రామ్ కొత్త సినిమా `ఎంత మంచి వాడవురా` ఈ సంక్రాంతికే విడుదల కానుంది. ఈ విషయాన్ని ఈ సినిమా మేకర్లు అధికారికంగా ప్రకటించారు.
మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకుడు. జులైలో చిత్రీకరణ మొదలై తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. సతీష్ వేగేశ్న `శతమానం భవతి` కూడా భారీ పోటీ మధ్య పండక్కి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా కూడా కుటుంబ సంబంధాల నేపథ్యంలో ఉండే ఫీల్‌గుడ్ మూవీ అని తెలుస్తోంది. అందుకే కంటెంట్‌పై నమ్మకంతో ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దించాలని డిసైడ్ అయ్యారు.
ఓ వైపు సూపర్‌స్టార్, మరో వైపు త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్… ఈ టాప్ అంచనాలు ఉన్న సినిమాలను తట్టుకుని పోటీలో కళ్యాణ్‌రామ్ తన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో సంక్రాంతికి ఎలా గట్టెక్కుతాడో ? చూడాలి.