నాలుగు వందల కోట్ల నష్టం.. ఊబిలో కూరుకుపోయిన నిర్మాత ??

-

క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన సినిమా వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌. ఈ సినిమా నిర్మాత కె.ఎస్ రామారావు. ఈయన ఇటీవల వరుసగా నిర్మించిన ‘తేజ్‌ ఐ లవ్‌ యూ’, ‘కౌసల్య కృష్ణమూర్తి’  ఇప్పుడు ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ మూడు సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. మూడు సినిమాలు పరాజయం పాలు కావడంతో తీవ్ర నష్టాల్లో కూరుకు పోయారు. అయినా కానీ టెక్నీషియన్లకు మరియు తన సినిమాలో నటించే నటీనటులకు ఎక్కడా కూడా పేమెంటు ఆపలేదు. మూడు సినిమాలు ప్లాప్ అయినా గాని నష్టం తానే భరిస్తూ తన ఆస్తులను అమ్ముకుంటూ సినిమాలను నిర్మించారు. Image result for world famous lover producer

ఇండస్ట్రీలో నిర్మాత కె.ఎస్.రామారావు కి మంచి పేరు ఉంది. ఎవరి డబ్బులు ఉంచుకోరు తన సినిమాల్లో నటించే టెక్నీషియన్ల నుండి నటీనటుల వరకు అదేవిధంగా లైట్ బాయ్ వరకు ఎవరికి వారికి వారి కష్టానికి తగ్గ డబ్బులు ఇవ్వడం అని. అయితే తాజాగా విజయ్ దేవరకొండ తో తెరకెక్కించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్‘ సినిమా దారుణంగా ఫ్లాప్ అవడంతో విజయ్ దేవరకొండకు పారితోషికంగా ఇవ్వాల్సిన డబ్బులు విషయంలో తన సొంత ఇల్లు అమ్మేసి కె.ఎస్.రామారావు డబ్బులు ఇచ్చినట్లు ఫిలింనగర్ టాక్. ఈ సినిమా అపజయం పాలు కావడంతో ఆర్థికంగా చాలా దెబ్బ తిన్నారట. 

మొత్తంమీద చూసుకుంటే గత మూడు సినిమాలకు 400 కోట్లు నష్టం రావడంతో నిర్మాత కె.ఎస్.రామారావు ప్రస్తుతం నష్టాల ఊబిలో కూరుకుపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో  ప్రస్తుతం కేఎస్‌ రామారావు సొంత ఇల్లు కూడా లేకపోవడంతో మాదాపూర్‌లోని ఒక ఇంట్లో అద్దెకు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ఇండస్ట్రీ లో అందరూ మాట్లాడుకుంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news