కొంపతీసి ధూమ్ ని కాపీ కొడుతున్నారా ఏంటి….??

-

నాచురల్ స్టార్ నాని , యంగ్ హీరో సుధీర్ బాబుల కలయికలో తెరకెక్కుతున్న తాజా సినిమా వి. ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఫస్ట్ టైం నాని ఒక నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు ఆడియన్స్ నుండి మంచి స్పందన లభిస్తోంది. మొదటి సారిగా తన లుక్ మొత్తం మార్చి విలన్ గా నాని ట్రైలర్ లో కనపరిచిన నటన, పలికిన డైలాగ్స్ కు మంచి స్పందన లభిస్తోంది. అలానే సుధీర్ బాబు కూడా పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టే పెర్ఫార్మన్స్ ని కనబరిచారు.

నివేత థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సైరా సినిమా సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తుండగా యువ సంగీత తరరంగం ఎస్ ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు పిజి విందా కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ని బట్టి చూస్తుంటే, ఇటీవల హిందీలో వచ్చిన ధూమ్ సినిమాల రీమేక్ మాదిరిగా కనపడుతోందని,

 

ఆ సినిమాల్లో పవర్ఫుల్ గా ఎంతో తెలివిగా ఉండే విలన్స్ ని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ గా వచ్చిన హీరో వేసే స్కెచ్ లు, అలానే వాటి నుండి తప్పించుకోవడానికి విలన్ చాకచక్యంగా తప్పించుకోవడం జరుగుతుంది. అయితే ఆ సినిమాల ఛాయలు ఈ సినిమాలో కనపడుతున్నాయని ప్రస్తుతం జోరుగా పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం పై వి సినిమా యూనిట్ ఇప్పటివరకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ సమయం వరకు వేచి చూడాల్సిందే…..!!

Read more RELATED
Recommended to you

Latest news