Adipurush : ఆదిపురుష్ ట్రైలర్ కు ముహుర్తం ఫిక్స్..

-

పాన్ ఇండియా హీరో ప్రభాస్ హిందీ డైరెక్టర్ తో చేస్తున్న పౌరాణిక కథా చిత్రం ఆదిపురుష్… ఇందులో రామాయణాన్ని ఇతివృత్తం గా తీసుకుని తెరకెక్కించిన ఈ సినిమాను ఓం రౌత్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ రాముడిగా మరియు కృతిసనన్ సీతగా నటిస్తోంది.

కాగా గత రెండు సంవత్సరాలుగా షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి ఇప్పుడు బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రెయిలర్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్షణం రానే వచ్చింది. ఈ సినిమా జూన్ 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇక ఇవాళ ఈ సినిమా ట్రైలర్‌ డేట్‌ ను అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. ఈ మేరకు ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. మే 9వ తేదీన ఆది పురుష్ మూవీ ట్రైలర్‌ ను రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version