ప‌వ‌న్ సినిమాపైనే నిధి ఆశ‌లు.. స్టార్‌డ‌మ్ వ‌స్తుందా?

ఇస్మార్ట్ బ్యూటీగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌యింది నిధి అగ‌ర్వాల్. ఈ భామ తెలుగులో నాగ‌చైత‌న్య స‌ర‌స‌న సవ్యసాచితో ఎంట్రీ ఇచ్చింది. అయితే గ్లామ‌ర్ హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న ఈ భామ‌కు ఆ త‌ర్వాత పెద్దగా స‌క్సెస్ రాలేదు. మిస్టర్ మజ్నుతో ల‌క్ ప‌రీక్షించుకున్నా పెద్ద‌గా క‌లిసిరాలేదు. కానీ రామ్‌తో చేసిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ రుచి చూసింది.

 

దీంతో వ‌రుస‌పెట్టి సౌత్ ఇండియాలోనే సినిమాలు చేస్తోంది. కోలీవు్‌లో కూడా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో అవ‌కాశం ద‌క్కింది నిధికి. ఇప్పుడు మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ స‌ర‌స‌న న‌టిస్తోంది. అలాగే ప‌వ‌ర్ స్టార్ స‌ర‌స‌న న‌టిస్తోంది.

ఈ భామ అన్ని సినిమాల కంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న హరి హర వీరమల్లు సినిమాపైనే అంచ‌నాలు పెట్టుకుంది. క్రిష్ దర్శకత్వంలో వ‌స్తున్న పీరియాడికల్ సినిమా కావ‌డంతో అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే త‌న స్టార్‌డ‌మ్ పెరుగుతుంద‌ని నిధి ఆశ ప‌డుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది. త్వ‌ర‌లోనే స్టార్ట్ చేస్తారంట‌. మ‌రి నిధి ఆశ‌లు నెర‌వేరుతాయో లేదో చూడాలి.