గురూజి మళ్లీ హాలీవుడ్ కాపీనా..!

-

మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ అజ్ఞాతవాసి సినిమా టైం లో ఆ సినిమా లార్గో వించ్ కథను కాపీ చేశాడని చాలా పెద్ద దుమారమే లేచింది. ఎలాగోలా దాని నుండి బయటకు వచ్చి ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత సినిమా తీసి హిట్ కొట్టాడు త్రివిక్రం. ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా కన్ఫాం చేశాడు త్రివిక్రం. నా పేరు సూర్య తర్వాత ఇద్దరు ముగ్గురు దర్శకులతో స్టోరీ డిస్కషన్స్ చేసి ఫైనల్ గా త్రివిక్రం కు ఓటు వేశాడు బన్ని.

అయితే ఈ సినిమా మొదలు కాకముందే సినిమా కథ ఇదే అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా మూలకథను ఓ హాలీవుడ్ సినిమా నుండి ఎత్తేస్తున్నాడట త్రివిక్రం. హాలీవుడ్ లో 2009లో వచ్చిన ది ఇన్వెన్షన్ ఆఫ్ లైయింగ్ సినిమా స్పూర్తిగా త్రివిక్రం బన్ని సినిమా కథ రాసుకున్నాడట. అసలు ఏమాత్రం అబద్ధాలు ఆడని హీరో ఒకచోట అబద్ధం ఆడాల్సి వస్తుందట. తండ్రి కొడుకుల మధ్య సెంటిమెంటల్ మూవీగా ఈ కథ రాసుకున్నాడట. తండ్రి చెప్పే అబద్ధాలను నిజం చేసే పాత్రలో హీరో కనిపిస్తాడట. మొత్తానికి త్రివిక్రం కు కలిసి వచ్చే తండ్రి కొడుకుల కథతోనే మళ్లీ సినిమా చేస్తున్నాడన్నమాట.

త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వాని నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version