పవన్ ని త్రివిక్రం కలవడానికి కారణం అదేనా…?

-

జనసేన అధినేత, సిని నటుడు పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్నేహం గురించి అందరికి తెలిసిందే. వీళ్ళు ఇద్దరు మంచి స్నేహితులు కావడం వీరి నుంచి వచ్చిన మూడు సినిమాల్లో రెండు సినిమాలు ఘన విజయం సాధించడంతో హిట్ కాంబినేషన్ గా కూడా వీరికి పేరుంది. ఇక పవన్ నటనకు త్రివిక్రమ్ దర్శకత్వం సరిగా సరిపోతుందని పవన్ అభిమానులు కూడా అంటూ ఉంటారు.

అయితే అజ్ఞాతవాసి సినిమా తర్వాత వీరి మధ్య గ్యాప్ వచ్చింది. ఆ సినిమా ఘోరంగా ఫెయిల్ అవ్వడంతో పవన్ అభిమానులు త్రివిక్రమ్ ని బూతులు తిట్టారు. అరవింద సమేత సినిమా కోసమే ఆ సినిమాను త్రివిక్రమ్ పట్టించుకోలేదు అని ఆగ్రహం వ్యక్తం చేసారు పవన్ ఫాన్స్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తాజాగా కలిసారు.

ఎందుకు కలిసారు ఏంటో తెలియదు గాని సోషల్ మీడియాలో మాత్రం వీరి ఫోటో వైరల్ గా మారింది. ప్రస్తుతం పవన్ పింక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారని కొందరు అంటుంటే పింక్ సినిమా తర్వాత పవన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకే వాళ్ళు కలిసారని సిని వర్గాల్లో పెద్ద చర్చలే ఇప్పుడు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news