త్రివిక్ర‌మ్ రూటే సెప‌రేటు.. ఇందుకే క‌దా అనేది!

త్రివిక్ర‌మ్ అంటే అది పేరు కాదు అదొక బ్రాండ్‌. మ‌రి అంత‌లా పేరు సంపాదించుకున్నారు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌. ఆయ‌న పెన్ను నుంచి డైలాగులు వ‌చ్చాయంటే అవి ట్రెండ్ సెట్టింగ్ కావాల్సిందే. సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా ఈయ‌న డైలాగుల చుట్టే ట్రోల్స్‌, మీమ్స్ న‌డుస్తాయంటే ఆయ‌న మాట‌ల ప‌వ‌ర్ అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక ఆయ‌న ఇప్పుడు మ‌హేశ్ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. త్రివిక్ర‌మ్ కోసం సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు అనిల్ రావిపూడి లాంటి డైరెక్ట‌ర్‌ను కూడా ప‌క్క‌న పెట్టి మ‌రీ సినిమా చేస్తున్నాడు. అంటే త్రివిక్ర‌మ్ కు ఉన్న ఇంపార్టెన్స్ అలాంటిద‌నుకోండి.

ఇక ఇప్పుడు కొవిడ్ కార‌ణంగా బ్రేక్ లో ఉన్న మాట‌ల మాంత్రికుడు.. మ‌హేశ్ త‌ర్వాత మ‌రో స్టార్ హీరోతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. విక్ట‌రీ వెంక‌టేశ్‌తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్ప‌టికే ఆయ‌న‌కు క‌థ‌ను కూడా వినిపించాడు. వెంక‌టేశ్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా చేయ‌క‌పోయినా.. ఆయ‌న సినిమాల‌కు మాట‌లు, క‌థ అందించాడు త్రివిక్ర‌మ్‌. మ‌రి ఇప్పుడు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.