త్రివిక్రం శ్రీనివాస్ ఒక్కసారి పట్టుకుంటే ఎవరినైనా ఉడుం పట్టే విడింపుచుకోవడం చాలా కష్టం ..!

-

మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఫాలో అవడం అంటే .. ఆయన సినిమాలు తీయడం, కథలు రాయడం, మాటలతో మాయ చేయడం ఇంకే దర్శకుడి వల్లా కాదు. ముఖ్యంగా త్రివిక్రమ్ డైలాగ్స్ మరే రచయిత, దర్శకుడు రాయగల సత్తా లేదనే చెప్పాలి. అందుకే ఆయన ఇన్ని సినిమాలు సక్సస్ అయ్యాయి. అంతేకాదు వరుసగా స్టార్ హీరోల తోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ ని త్రివిక్రమ్ ఎక్కువగా రిపీట్ చేస్తారని అంటుంటారు. ఇప్పటి వరకు ఆయన చేసిన హీరోయిన్స్ దాదాపు రిపీటవుతున్న వాళ్ళే ఉన్నారు. ఎక్కువగా ఇలియానా, ఆ తర్వాత , సమంత, .. ఇప్పుడు పూజా హెగ్డే. అయితే గురూజికి ఒకసారి ఎవరైనా ట్యూన్ అయితే వాళ్ళని అంత ఈజీగా వదలరు. అందుకు ఉదాహరణ హీరోయిన్సే కాదు మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్.

 

జల్సా సినిమాకి ట్యూన్ అయిన దేవీ శ్రీ ప్రసాద్ సన్నాఫ్ సత్యమూర్తి వరకు త్రివిక్రమ్ తో సక్సస్ ఫుల్ జర్నీ చేశారు. ఇద్దరి కాంబినేషన్ లో అద్భుతమైన ఆల్బంస్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత త్రివిక్రమ్ దేవీశ్రీ ప్రసాద్ ని వదిలేశారు. థమన్ తో ట్యూన్ అయ్యారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఎన్.టి.ఆర్ హీరోగా అరవింద సమేత వీర రాఘవ సినిమాకి థమన్ ఇచ్చిన మ్యూజిక్ బాగా సక్సస్ అయింది. దాంతో త్రివిక్రమ్ మళ్ళీ థమన్ కి ‘అల వైకుంఠపురంలో’ సినిమా ఛాన్స్ ఇచ్చారు. థమన్ ఇచ్చిన మ్యూజిక్ .. అల హిట్ అవడానికి ప్రధాన పాత్ర వహించింది. ఈ సినిమా సక్సస్ లో సగం క్రెడిట్ థమన్ కే ఇవ్వాలి అంటూ త్రివిక్రమ్, అల్లు అర్జున్ అందరిలో వెల్లడించిన సంగతి కూడా తెలిసిందే. అందుకే త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ని తీసుకోవాలనుకుంటున్నారట.

మరి మళ్ళీ ఈ ఇద్దరు కలిసి మ్యూజిక్ విషయం లో మ్యాజిక్ చేస్తారేమో చూడాలి. ఎటు థమన్ కి ఎన్.టి.ఆర్ తోను మంచి బాండింగ్ ఉంది. సినిమాల సక్సస్ ఎలా ఉన్నా గతంలో ఈ ఇద్దరు కాంబోలో వచ్చిన మ్యూజిక్ బాగా సక్సస్ అయింది. ఇక ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏమిటంటే హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఈ సినిమాలో జాయిన్ అవుతుందని తెలుస్తుంది. అదే జరిగితే త్రివిక్రమ్ తో కలిసి పూజా హెగ్డే చేస్తున్న మూడో సినిమా … అలాగే ఎన్.టి.ఆర్ తో కలిసి చేస్తున్న రెండవ సినిమా అవుతుంది. ఏదేమైనా త్రివిక్రమ్ ..
పూజా హెగ్డేని, థమన్ ని గట్టిగానే పట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version