పంథా మార్చిన మాటల మాంత్రికుడు.. ఈ సారి సీనియ‌ర్ హీరోతో

ఆయ‌న పెన్ను నుంచి జాలువారేవి మాట‌లు కాదు తూటాలు. చిన్న లైన్ చుట్టూ బ‌ల‌మైన క‌థ‌ను డైలాగుల‌తో న‌డిపించ‌గ‌ల డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌. రైట‌ర్ నుంచి మొదలుపెట్టి డైరెక్ట‌ర్‌గా మారాడు. ఆయ‌న ఎక్కువ‌గా స్టార్ హీరోల‌తోనే సినిమాలు చేస్తుంటాడు. మ‌రీ ముఖ్యంగా యంగ్‌హీరోల‌తోనే కాంబో ఫిక్స్ చేసుకుంటాడు. కానీ ఈ సారి ఓ సీనియ‌ర్ హీరోతో రాబోతున్నాడు.

క్లాస్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ విక్ట‌రీ వెంక‌టేశ్‌. ఆయ‌న ప్ర‌స్తుతం ఎఫ్‌-3సినిమాతో రాబోతున్నాడు. నార‌ప్ప షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది.

ఇప్పుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు వెంక‌టేశ్‌. బాలీవుడ్‌లో హిట్ అయిన ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 2’ రీమేక్ చేయాల‌ని చూస్తున్నారు. అయితే రీమేక్ సినిమాతో వ‌స్తారా లేక కొత్త క‌థ‌తో మెస్మరైజ్ చేస్తారా అని తెలియాల్సి ఉంది. అయితే ఈ రోజు వెంక‌టేశ్ ఈ రెండింటిలో దేన్ని ఫైన‌ల్ చేస్తారో వేచి చూడాలి. మొత్తానికి గురూజీ మ‌రోసారి పంథా మార్చుకుని సీనియ‌ర్ హీరోతో చేస్తున్నాడు.