అగ్ర హీరోని టార్గెట్ చేస్తున్నత్రివిక్రమ్…!

-

ఆర్ఆర్ఆర్ సినిమాతో చాలా బిజీ గా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాలో అతను కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తో పాటు చేస్తున్న ఈ సినిమాలో అతని పాత్ర ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పాత్రలో నటిస్తాడు అనేది అందరికి ఆసక్తి నెలకొంది. కరోనా వైరస్ నేపధ్యంలో ఈ సినిమా షూటింగ్ ని చిత్ర యూనిట్ వాయిదా వేసిన నేపధ్యంలో తర్వాతి సినిమా గురించి చర్చలు జరుపుతున్నాడు.

త్రివిక్రమ్ తో అతను చేసే సినిమా విషయంలో ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ని రాజకీయ నాయకుడిగా చూపిస్తాడు త్రివిక్రమ్ అని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో గాని సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం ఒక రేంజ్ లో జరుగుతుంది. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన ఒక అంచనాకు త్రివిక్రమ్ వచ్చాడు అనేది టాలీవుడ్ జనాల మాట. ఫస్ట్ లుక్ కూడా వస్తుంది అంటున్నారు.

ఇది ఇలా ఉంటే… ఈ సినిమా ద్వారా కొన్ని టార్గెట్ చేసారట ఈ ఇద్దరు. వచ్చే ఏడాది వేసవి టార్గెట్‌గా ఈ సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు. అలాగే అప్పుడు ఒక అగ్ర హీరో సినిమా ఉందని ఆ సినిమాను టార్గెట్ చేసి త్రివిక్రమ్ ఈ ప్లాన్ చేసాడని అంటున్నారు. అయిననూ పోయి రావలే హస్తినకు అనే టైటిల్ ని ఖరారు చేసారని అంటున్నారు. ఆ అగ్ర హీరో సినిమా విడుదలకు రెండు రోజుల ముందు విడుదల చెయ్యాలని భావిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news