కరోనా ఎఫెక్ట్ తో పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ సగం పడిపోయిందా …?

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ లో ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అందరీ తెలిసిందే. రెండేళ్ళ తర్వత రీ ఎంట్రీ అనగానే ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అత్తారింటికి దారేది సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన ఆయన అజ్ఞాతవాసి తో భారీ డిజాస్టర్ ని చూశారు. అయితే ఆ తర్వాత సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమా పింక్ తో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ 50 కోట్ల తో పాటు షేర్ అని కూడా సమాచారం.

 

 

ఇక రీ ఎంట్రీ ఇస్తూనే వరుసగా సినిమాలని లైన్ లో పెట్టారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వరుసగా సినిమాలను అనౌన్స్ చేయగానే ఇండస్ట్రీ మొత్తం షాకయింది. ఫ్యాన్స్ అయితే ఈ స్పీడ్ కి ఉబ్బు తబ్బిబ్బై పోయారు. కాని పవన్ కళ్యాణ్ కి కరోనా పెద్ద షాకిచ్చింది. లాక్ డౌన్ నేపథ్యంలో సినిమాలన్ని షట్ డౌన్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కమిటయిన సినిమాలకి పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ లో ఇప్పుడు దాదాపు సగం తగ్గించుకోమని నిర్మాతలు ఒత్తిడి చేస్తున్నారట. ఈ ప్రతిపాదన ముందు దిల్ రాజు నుంచే మొదలయినట్టు లేటెస్ట్ న్యూస్.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా పెండింగ్ పడటం తో ఈ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ కమిటయిన మిగతా సినిమాల మీద గట్టిగా పడింది. మిగతా సినిమాకి ఇచ్చిన డేట్స్ మొత్తం తారుమారు అయ్యాయి. అంతేకాదు ఆ సినిమా మేకర్స్ కూడా మళ్ళీ వెంటనే సినిమాలు మొదలు పెట్టే పరిస్థితులు కనిపిచడం లేదు. వకీల్ సాబ్ ఫినిష్ చేసి నెక్స్ట్ క్రిష్ సినిమా తర్వాత హరీష్ శంకర్ సినిమా, ఆ తర్వాత త్రివిక్రం లేదా పూరి జగన్నాధ్ ప్రాజెక్ట్ , ఆ తర్వాత డాలీ సినిమాలు కమిటయ్యారు.

అయితే ఒక్కో సినిమానికి రెమ్యూనరేషన్ 50 కోట్లు లాభాల్లో వాటా, శాటిలైట్ బిజినెస్ లో వాటా అని నిర్మాతలతో ఒప్పందం చేసుకున్నారు. నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ ని దృష్ఠిలో పెట్టుకొని ఆయన అడిగినట్టుగానే డీల్ కి సరే అన్నారట. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో వాటాలు ఇవ్వలేమని రెమ్యూనరేషన్ కూడా 20 నుంచి 30 కోట్ల వరకే ఇస్తామంటు అంటున్నారట. ఇప్పుడిది పవన్ కళ్యాణ్ కి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే కమిటయిన సినిమాలకి అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు డ్రాపయ్యో పరిస్థి లేదు. అలాని రెమ్యూనరేషన్ తగ్గించుకుంటారా అంటే అది డైలామా ..? మరి ఏమి చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news