ఎన్టీఆర్ ఆర్ట్స్ లో త్రివిక్రం

-

అరవింద సమేత సినిమాతో హిట్ అందుకున్న త్రివిక్రం మళ్లీ నందమూరి హీరోతోనే సినిమా చేస్తాడా అంటే అవునంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఎన్.టి.ఆర్ తో మొదటిసారి కలిసి సినిమా చేసిన త్రివిక్రం అరవింద సమేత సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం తన తర్వాత సినిమా డిస్కషన్స్ లో ఉన్న త్రివిక్రం కు ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ అధినేత.. హీరో కళ్యాణ్ రాం అడ్వాన్స్ ఇచ్చాడట.

తమ బ్యానర్ లో ఓ సినిమా చేయాలని కోరాడట. త్రివిక్రం కూడా అడ్వాన్స్ తీసుకుని అందుకు ఓకే చెప్పినట్టు టాక్. త్రివిక్రం కోసం అల్లు అర్జున్ రెడీగా ఉన్నాడు. మాటల మాంత్రికుడి తర్వాత సినిమా బన్నితోనే అవుతుంది. ఆ తర్వాత సినిమా ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ లో కుదిరితే ఎన్.టి.ఆర్ తో లేదంటే కళ్యాణ్ రాం తో చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అజ్ఞాతవాసి ఫ్లాప్ తో కెరియర్ లో ఎన్నడు లేని విధంగా అపవాదాలు మూటకట్టుకున్న త్రివిక్రం అరవింద సమేత హిట్ తో మళ్లీ తన సత్తా చాటాడు.

Read more RELATED
Recommended to you

Latest news