గ్రేట్.WWE లోకి బిగ్ బాస్ తెలుగు 5 కంటెస్టెంట్

తెలుగు సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వ. సినిమాల్లోనూ నటించినప్పటికీ విశ్వ కు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ సీరియల్స్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. కాగా విశ్వ లేటెస్ట్ గా బిగ్ బాస్ 5 లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విశ్వ తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. తన కు మొదటి సారిగా యువ సీరియస్ లో నాగార్జున అవకాశం ఇచ్చారని చెప్పారు. అంతే కాకుండా నాగ చైతన్య హీరోగా పరిచయం అయిన జోష్ సినిమా లో కూడా నటించానని….అప్పుడు కూడా నాగ్ సార్ అవకాశం ఇప్పించాలని విశ్వ తెలిపాడు.

తనకు లైఫ్ ఇచ్చింది నాగార్జున నే అని ఇప్పుడు ఆయన ముందే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు. ఇక సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపిస్తున్న విశ్వ తాను త్వరలో ప్రపంచం లోనే ఎంతో ఫేమస్ రెజ్లింగ్ షో డబ్ల్యు డబ్ల్యు ఈ లో సెలెక్ట్ అయినట్టు తెలిపాడు. ఇండియాలో ఆడిషన్స్ జరిగాయని అందులో ఇండియా నుండి తనను సెలెక్ట్ చేశారని చెప్పాడు. నిర్వాహకులు ఫైనల్ చేస్తే తాను డబ్ల్యు డబ్ల్యు ఈ లోకి ఎంట్రీ ఇస్తానని విశ్వ తెలిపాడు. ఇక ఇప్పటి వరకు ఇండియా నుండి అతి తక్కువ మంది ఈ రెజ్లింగ్ షోలో పాల్గొన్నారు. ఇప్పుడు మన తెలుగు వ్యక్తి నటుడు ఈ షోకి వెళితే తెలుగు వారు గర్వించదగ్గ విషయమే అని చెప్పాలి.