మీరు తక్కువ డబ్బులతో ఎక్కువ డబ్బులు పొందాలని అనుకుంటున్నారా..? అయితే తప్పక మీరు దీని కోసం చూడాలి. అందరికీ డబ్బు సంపాదించాలని ఉంటుంది. అయితే కొందరికి కష్టపడి సంపాదించాలి అని ఉంటే.. మరి కొందరు ఏదైనా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. అయితే ఈ పద్దతి మాత్రం డబ్బు తో మరి కాస్త సంపాదించడం. అంటే ఏం లేదండి మీ దగ్గర డబ్బుని ఇన్వెస్ట్ చేసి ఎక్కువగా సంపాదించడం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
అయితే మీరు మొదట ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యాలి. దీనిలో మీరేమి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టాల్సిన పని లేదు. రోజుకు రూ.50 పొదుపు చేస్తే చాలు. ఇలా మీరు రూ.50తో ఈజీగా కోటీశ్వరులు అవ్వొచ్చు. ఇక ఇది ఎలా అనేది చూస్తే…. దీని కోసం మీరు ప్రతి రోజు రూ.50 పొదుపు చేసి నెల చివరిలో రూ1500 సిప్ SIP చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో 12 నుంచి 15 శాతం వరకు రాబడిని అందిస్తాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
మీరు నెలకు రూ.1500లను సిప్ చేయాలి. ఇలా 35 ఏళ్లు ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యాల్సి ఉంటుంది. 12.5 శాతం రాబడి ప్రాతిపదికన చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో మీకు రూ.1.1 కోట్లు వస్తాయి. ఒకవేళ మీరు 30 ఏళ్లు ఇన్వెస్ట్‌మెంట్‌ను చేస్తే నష్టపోతారు. మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.59 లక్షలు పొందొచ్చు. అంటే 5 ఏళ్లు ఇన్వెస్ట్ చేయకపోతే దాదాపు రూ.40 లక్షలు తగ్గుతున్నాయి. ఇది ఇలా ఉంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్లకు కూడా మార్కెట్ రిస్క్ ఉంటుంది.