గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం అస్తమయంతో భారతీయ చిత్ర సీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త విని సినీలోకం దిగ్భ్రాంతికి లోనయింది. అమృత గళంతో తరాల్ని ఓలలాడించిన అమర గాయకుడు బాలు అంటూ సినీ ప్రముఖులు కన్నీటి నివాళులర్పించారు. బాలసుబ్రహ్మణ్యంతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. అయితే కరోనా సమయంలో బాలు టీవీ షోకు హాజరుకావడమే ఆయన ప్రాణానికి ముప్పుగా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి.
కరోనా విజృంభిస్తున్న సమయంలో పెద్ద వయస్సు ఉన్న వారు బయటకు రావొద్దని ప్రభుత్వాలు, వైద్యులు ఎంతగానో హెచ్చరించారు. అయితే ఓ టీవీ షో నిర్వాహకులు బాలుని కాస్త ఫోర్స్ చేయడంతో జులై 30 న ఆయన “సామజవరగమనా” అనే టీవీ షోకు అటెండ్ అయినట్టు తెలుస్తుంది. ఆ షోలో అటెండ్ అయిన చాలా మందికి పాజిటివ్ వచ్చింది . మిగతా వారికి కరోనా తగ్గింది. కానీ బాలూ వయసులో పెద్దవారు కావడంతో ఆయనపై తీవ్ర ప్రభావం చూపిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో శుక్రవారం మధ్యాహ్నం బాలు కన్నుమూశారు.