హైదరాబాద్ లో హై అలెర్ట్.. రంగంలోకి డిజాస్టర్ టీమ్స్ !

-

హైదరాబాద్‌‌ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. నిన్న సాయంత్రం మొదలయిన ఈ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రోడ్లపై వర్షం వరదనీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణీకుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఇటీవల చోటు చేసుకున్న ఘటనల నేపధ్యలలో ప్రయాణీకులు జాగ్రత్తగా ఉండాలని, నాలాల వద్ద ప్రమాదం పొంచి ఉండటంతో బయటకు ఎవరూ రావద్దని జీహెచ్ఎంసి అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ డిజాస్టర్ బృందాలు అన్నీ సిద్దంగా ఉన్నాయి.

హైద‌రాబాద్ పరిధిలోని హ‌య‌త్‌న‌గ‌ర్‌, రాజేంద్ర‌న‌గ‌ర్‌, అత్తాపూర్‌, హిమాయ‌త్‌ సాగ‌ర్‌, కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ జీడిమెట్ల‌, కుత్బుల్లాపూర్‌, బాలాన‌గ‌ర్‌, దుండిగ‌ల్‌, కొంప‌ల్లి, ఎల్బీన‌గ‌ర్‌‌, ఉప్ప‌ల్‌, సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, గండిపేట్‌, ప్రాంతాల్లో ఎడ‌తెర‌పిలేకుండా కురుస్తున్నది. ఎమర్జన్సీ అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈరోజు మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్‌ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా 5.8 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వివరించింది. దాని ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news