ట్విట‌ర్ పోల్ : బాహుబ‌లి క‌న్నా ట్రిపుల్ ఆర్ గ్రేట్ ? ఎందుకో తెలుసా !

బాహుబ‌లి సినిమా క‌న్నా ట్రిపుల్ ఆర్ గ్రేట్..అందుకు వంద కార‌ణాలు ఉన్నాయి. అవ‌న్నీ ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ముఖ్యంగా మూవీ మేకింగ్ లో వ‌చ్చిన ప‌రిణితే ఇందుకు దోహ‌దం అయిన ప్ర‌ధాన కార‌కం. ముఖ్యంగా సినిమా మొద‌లు నుంచి చివ‌రి దాకా ఎక్క‌డ బిగి స‌డ‌ల‌ని విధంగా రాసుకున్న క‌థ‌నం బాగుంది. అదే ఈ చిత్ర విజయానికి కార‌ణం. ఎమోష‌న‌ల్ క‌నెక్టివిటీ అన్న‌ది రాజ‌మౌళి అన్ని సినిమాల క‌న్నా కాస్త ఎక్కువ‌గానే ఉంది. అది కూడా ఓ కార‌ణం. ఇద్ద‌రు హీరోలు ఉన్నారు క‌దా! అని అతి చేయ‌ని విధానం కూడా బాగుంది. అదే ఈ చిత్ర అనూహ్య విజ‌యానికి మ‌రో కార‌ణం.

అవును 77.9%
కాదు 22.1%

వరల్డ్‌ వైడ్‌ గా “ఆర్‌ఆర్‌ఆర్‌” సినిమా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా.. తెలుగు, హిందీ, ఇండియా, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొడుతోంది. బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంతో వస్తున్న సినిమా కావడంతో, రామ్ చరణ్, తార‌క్ క‌లిసి తొలిసారి న‌టిస్తుండ‌డంతో సహజంగానే ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఇందుకు తగ్గట్లుగానే సినిమా యూనిట్ ప్రమోషన్ వర్క్ చేసింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమా సూపర్ హిట్ అయింది. యూఎస్‌లో హాలీవుడ్‌ బిగ్‌ ప్రాజెక్టులు ద లాస్ట్‌ సిటీ, ద బ్యాట్‌ మ్యాన్‌ కలెక్షన్లు సైతం సునాయాసంగా అధిగమించింద‌ని ఫిల్మ్ సర్కిల్‌ చెబుతోంది.

వాస్త‌వానికి ప్రభాస్‌ నటించిన బాహుబలి రిలీజ్‌ అయిన సమయం వేరు. ఇప్పుడున్న సిట్యువేష‌న్ వేరు. ఆ సమయంలో.. రికార్డులు, కలెక్షన్లు కొల్లగొట్టడం చాలా సులభం. అంటే ఈ లెక్కన ఇప్పుడున్న ప్ర‌తికూల‌త‌ల నేప‌థ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీనే గ్రేట్‌. ఇదే విష‌యాన్ని నెటిజ‌న్లు కూడా ఒప్పుకుంటున్నారు. ఇద్ద‌రు స్టార్ హీరోలు (తార‌క్ మ‌రియు చ‌ర‌ణ్‌) ను బ్యాలెన్స్ చేయ‌డం క‌ష్ట‌మ‌ని చెబుతూనే, రాజ‌మౌళి లాంటి దిగ్గ‌జ ద‌ర్శ‌కులు ఈ త‌ర‌హా స‌వాళ్ల‌ను సునాయాసంగా దాటేశార‌ని పొగ‌డ్త‌ల వాన కురిపిస్తున్నారు ప్రేక్ష‌కులు. బాహుబ‌లి క‌న్నా ఈ సినిమా లో చాలా ఉద్వేగాలు బాగా పండాయి అని కితాబిస్తున్నారు. ఎన్టీఆర్ చాలా స‌న్నివేశాల్లో జీవించాడ‌ని, చ‌రణ్ కూడా ఎక్క‌డ ఏమీ త‌గ్గ‌కుండా డైరెక్ట‌ర్ చెప్పిన విష‌యాల‌ను అర్థం చేసుకుని భావోద్వేగాలు ప‌లికించాడ‌ని చాలా మంది కితాబు ఇస్తున్నారు. త్వ‌ర‌లో సీక్వెల్ కూడా వచ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

– ట్విట‌ర్ పోల్ – మ‌న లోకం ప్ర‌త్యేకం