ఆ పాత్ర నిడివి ఇంకొంచెం ఉంటే బాగుండేది.. ‘ఆర్ఆర్ఆర్’ స్టోరి రైటర్ విజయేంద్రప్రసాద్ కామెంట్స్..

-

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటడమే కాకుండా పతాక స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడిగా మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి చరిత్రలో నిలిచిపోతారు. చిత్రం విడుదలైన తొలి వారంతంలో ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా రూ.500 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం. ఇక ఈ చిత్ర సక్సెస్ ను ఇటీవల సెలబ్రేట్ చేసుకున్నారు మూవీ యూనిట్ సభ్యులు. దర్శకుడు రాజమౌళి, రామ్ చరణ్, ఉపాసన, రమా రాజమౌళి తదితరులు ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయగా, ఇందులో స్పెషల్ అట్రాక్షన్ గా దేవసేన అనుష్క శెట్టి నిలిచింది.

vijayendraprasad
vijayendraprasad

పిక్చర్ సక్సెస్‌ను అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ‘ఆర్ఆర్ఆర్’ మూవీ యూనిట్ సభ్యులు.
ఈ క్రమంలోనే స్టోరి రైటర్ విజయేంద్రప్రసాద్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాజాగా ఆయన ఓ తెలుగు మీడియా సంస్థకు సినిమా విడుదల తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో సినిమా స్టోరి, డైరెక్షన్, పాత్రల స్వభావం, విజయానికి కారణమైన అంశాలపైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా స్టోరి ప్రధానంగా ఎమోషన్స్ ను ఆధారంగా చేసుకుని కల్పితం చేయబడినదని చెప్పారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పాత్రలను భావోద్వేగంగా తీర్చిదిద్దనట్లు తెలిపారు. ఇక ఈ సినిమాలో ఏదేని పాత్ర గురించి మీకు ఇంకా చేసి ఉంటే బాగుండేదని యాంకర్ ప్రశ్న వేయగా.. విజయేంద్రప్రసాద్ ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘సీత’ పాత్ర నిడివిని ఇంకొంచెం పెట్టి ఉండాల్సిందని అన్నారు.

ఈ విషయం సినిమా షూటింగ్ సమయం నుంచి తాను చెప్తున్నానని, కానీ, అప్పటికే చిత్రం మూడు గంటలు అయినందున అది సాధ్యపడలేదని చెప్పుకొచ్చారు. సీత పాత్ర నిజంగా అల్లూరి వారి నిజజీవితంలో లేదని, కానీ, సూపర్ స్టార్ కృష్ణ తీసిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలో ఉందని, అలా దానిని ఇక్కడకూ ఇంప్లాంట్ చేసినట్లు తెలిపారు విజయేంద్రప్రసాద్. ఇక రామ్ చరణ్ పాత్రలోని లేయర్స్ క్లిష్టతరంగా ఉంటాయని, అండర్ డాగ్‌గా పాత్రను డిజైన్ చేశామని, తారక్ పాత్ర ఇన్నోసెంట్ గా ఉంటుందని వివరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news