ట్విటర్ ట్రెండ్ : సుకుమార్ vs త్రివిక్రమ్ నడుస్తోంది .. ఎవరు గొప్ప ?

-

‘బాహుబలి’ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘పారసైట్’ కొరియన్ మూవీ గురించి ఊహించని విధంగా కామెంట్లు చేశారు. చాలా తలబిరుసు తనంగా రాజమౌళి మాట్లాడారు. దీంతో రాజమౌళిపై ప్రముఖులు మరియు నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఇటువంటి తరుణంలో ట్విటర్ లో నెటిజనులు నెంబర్ వన్ టాలీవుడ్ డైరెక్టర్ ఎవరు? ఎవరు గొప్పగా సినిమాలు చేస్తారు అన్న విషయం గురించి తెగ డిస్కషన్స్ జరిపారు. ఆ సమయంలో చాలా మంది డైరెక్టర్లు పేర్లు వచ్చినా కానీ ఎక్కువ మంది నెటిజన్లు త్రివిక్రమ్ మరియు సుకుమార్ గురించి గట్టిగా చర్చించుకోవటం జరిగింది. ఇద్దరు డైరెక్టర్లు అభిమానులు నువ్వానేనా అన్నట్టుగా డిస్కషన్స్ జరిపారు.Trivikram Comedy Punch to Sukumar At LIE Pre Release Event

 

ఈ సందర్భంలో త్రివిక్రమ్ గురించి రెడ్డి గారు మాట్లాడుతూ.. మాటలు మరియు పంచులు రాయటంలో త్రివిక్రమ్ ని మించిన వారు లేరని త్రివిక్రమ్ నెంబర్ వన్ డైరెక్టర్ అని చెప్పడంలో దీనికి మించి మరొకటి లేదని అన్నారు. అయితే త్రివిక్రముని విభేదించే నెటిజన్లు.. ఇప్పటివరకు త్రివిక్రమ్ తీసిన సినిమాలు ఏవి కూడా తాను సొంతంగా తీసినది చాలా తక్కువ అని చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వం లో విజయాలు సాధించిన సినిమాలు అన్ని నవల ఆధారంగా గాని హాలీవుడ్ సినిమాల కథ బేస్ చేసుకుని తీయడం గాని జరిగిందని తెలిపారు. ప్రతి సినిమాకి రియాల్టీ కి చాలా దూరంగా ఉంటూ కాపీ కొట్టడానికి త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నాడని డిస్కషన్ జరిపారు.

 

ఇక లెక్కల మాస్టర్ సుకుమార్ విషయానికొస్తే. ఆయన సినిమాల్లో ప్రతి దానిలో కొత్తదనం కనబడుతుందని నెటిజన్లు చెప్పుకొచ్చారు. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపించడంలో సుకుమార్ ని మించిన వారు మరొకరు ఉండరని అన్నారు. ఎక్కడా కూడా కాపీ చేసి దాఖలాలు సుకుమార్ సినిమాలో కనిపించవు అని, అందుకే సుకుమార్ లాంటి డైరెక్టర్ నీ కూడా రాజమౌళి ఇష్టపడుతున్నారని నెటిజనులు అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో రియాల్టీ గా సినిమాలు తీసే ఏకైక డైరెక్టర్ సుకుమార్ అని అన్నారు. ఇక ఇండస్ట్రీలో ఆయన మించిన గొప్ప డైరెక్టర్ మరొకరు లేరని, చాలా మంది నెటిజన్లు సుకుమార్ కే జై కొట్టారు. ప్రస్తుతం ట్విట్టర్లో ఇది బాగా ట్రెండ్ అవుతుంది. 

Read more RELATED
Recommended to you

Latest news