అక్కినేని కుటుంబంలో ఊహించని మార్పులు..కారణం..?

-

అక్కినేని కుటుంబానికి సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రత్యేక గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అప్పట్లో ఆ కుటుంబానికి ఉన్న వైభోగం ఇప్పుడు లేదనే చెప్పాలి. ముఖ్యంగా అక్కినేని హీరోలు నటించిన సినిమాలు, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలుస్తూ.. పూర్వ వైభోగాన్ని పొందలేక పోతున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున నటించిన ఘోస్ట్ , అఖిల్ నటించిన ఏజెంట్, నాగచైతన్య నటించిన కస్టడీ వంటి సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. మిగతా హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తూ ఆ సినిమాలతో రూ.100 కోట్ల క్లబ్లో చేరుతుంటే.. వీరు మాత్రం ఇంకా హిట్ కోసమే కొట్టుమిట్టాడుతూ ఉండడం గమనార్హం.

 

ఇకపోతే వ్యక్తిగత విషయాల్లో కూడా వీరు సక్సెస్ కాలేకపోవడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో కి విజయ్ దేవరకొండ గెస్ట్ గా రాగా.. నాగార్జున తన మాజీ కోడలు సమంతా గురించి అడుగుతూ.. ఎక్కడ మీ హీరోయిన్ సామ్ అని అడిగారు . అంతేకాదు అక్కినేని ఫ్యామిలీతో సమంత విడిపోయిన తర్వాత నాగార్జున ఆమె పేరుని చాలా సందర్భాలలో ప్రస్తావించారు. అలాగే మొన్న నాగార్జున వైఫ్ అమల అన్నపూర్ణ స్టూడియోలో NEO FIESTA 2023 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై 30 ఏళ్ల తర్వాత స్టేజిపై హలో బ్రదర్ సినిమాలోని ప్రియురాగాలే పాటకు తనదైన శైలిలో స్టెప్పులేసి అలరించింది.

ఇకపోతే నాగార్జున , అమల ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేయడంతో అక్కినేని ఫ్యామిలీ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ ఫ్యామిలీ పై దారుణంగా ట్రోల్ చేసినా.. పెద్దగా పట్టించుకోని అక్కినేని కుటుంబం ఇప్పుడు అభిమానులను ఎంటర్టైన్ చేయడం వెనుక అర్థం ఏమి ఉంటుంది అంటూ జనాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందుకు గల కారణం ఏమిటి ?అని తెలియాలి అంటే ఇంకా అసలు విషయం తెలియాల్సి ఉంది అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news