రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. కేంద్ర ఐటీ శాఖ సీరియస్

-

నేషనల్ క్రష్ రష్మిక మందన్న మార్ఫింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి రష్మిక ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే కొందరు రష్మికపై ఇలాంటి వీడియోలు చేసి ఆమె ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో తీవ్రంగా మండిపడుతున్నారు. దీనిపై కేంద్ర ఐటీ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి మార్ఫింగ్‌ వీడియోల కట్టడి సామాజిక మాధ్యమాల బాధ్యతే అని స్పష్టం చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Rashmika Mandanna

ఇంటర్నెట్‌ను వినియోగించే డిజిటల్‌ పౌరులకు భద్రత కల్పించేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తాజాగా ఎక్స్‌ వేదికగా వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జారీ చేసిన ఐటీ నిబంధల ప్రకారం.. సామాజిక మాధ్యమ వేదికలు కొన్ని చట్టపరమైన బాధ్యతలను పాటించాల్సి ఉంటుందని.. దీని ప్రకారం.. తమ మాధ్యమాల్లో ఏ యూజర్‌ కూడా నకిలీ/తప్పుడు సమాచారాన్ని పోస్ట్‌ చేయకుండా చూసుకోవాలని సూచించారు. ఒకవేళ అలాంటి ఫేక్‌ సమాచారాన్ని గుర్తిస్తే.. దాన్ని 36 గంటల్లోగా తొలగించాలని లేనియెడల రూల్‌ 7 కింద.. ఆ సామాజిక మాధ్యమాలను కోర్టుకు లాగొచ్చని హెచ్చరించారు. మార్ఫింగ్‌ అనేది అత్యంత ప్రమాదకరమైన చర్యగా అభివర్ణించిన రాజీవ్.. ఈ సమస్యను సామాజిక మాధ్యమాలే పరిష్కరించాలని పోస్టులో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news