వివాదంలో రామ్ చరణ్ భార్య…ఆ పోస్ట్ పై ఫైర్ అవుతున్న నెటిజన్స్….!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ భార్య గా అపోలో అధినేత మనవరాలిగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఉపాసన ప్రజల్లో క్రియేట్ చేసుకుంది. ఉపాసన అనేక సామాజిక కార్యక్రమాల్లో భాగం పంచుకుంటూ ఎంతో మంది ప్రజలకు మేలు జరిగేలా తన వంతు సహాయం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంది. అలాగే ఉపాసన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను , ఫిట్ నెస్ కు సంబంధించిన చిట్కాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇలా ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసే ఆరోగ్య చిట్కాలను చాలా మంది నెటిజన్ లు ఫాలో అవుతూ కూడా ఉంటారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు మంచి విషయాలను పోస్ట్ చేస్తూ ఉండే ఉపాసన తాజాగా పోస్ట్ చేసిన ఒక ఫోటో ద్వారా నెటిజన్ ల ఆగ్రహానికి గురి అయ్యింది.

దానికి కారణం ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో నే. రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26 న దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఓ గుడి గోపురం ఫోటోని ఉపాసన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలో దేవుళ్ల ఫోటోలకు బదులు.. కొంతమంది ప్రజలు ఉన్నారు. ఆ ఫోటోలో తనతో పాటు రామ్‌ చరణ్‌ కూడా ఉన్నాడు అని… ఎక్కడ ఉన్నాడో కనిపెట్టండి అటు ఉపాసన ఫాలోవర్స్‌ని కోరారు. ఇలా ఉపాసన పోస్ట్ చేసిన ఫోటోను చూసిన కొంతమంది నెటిజన్లు ఉపాసన పై మండిపడుతున్నారు. ఈ పోస్టర్‌ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, ఇలాంటి పోస్టులు పెట్టి మీపై ఉన్న గౌరవాన్ని తగ్గించుకోకండి అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ పెడుతున్నారు.