ప్లాప్ డైరెక్టర్‌ను న‌మ్ముకున్న‌ అల్లు శిరీష్.. స‌క్సెస్ అవుతాడా..?

-

అల్లు శిరీష్ కు టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకునేందుకు ఎంతో కష్టపడుతున్నాడు. మెగా మేనల్లుడిగా అల్లు వారి అబ్బాయి గా టాలీవుడ్ హీరో గా ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. మెగా బ్యాక్ గ్రౌండ్… మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తమ్ముడిగా ఉన్న అల్లు శిరీష్‌కు మాత్రం ఒడిదుడుకులు తప్పడం లేదు. అల్లు శిరీష్ నటించిన చిత్రాలు వరుసగా నిరాశపరుస్తున్నాయి. అల్లు శిరీష్ కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రం అంటే ‘శ్రీరస్తు శుభమస్తు’ అనే చెప్పాలి. పరుశురాం దర్శత్వంలో వచ్చిన ఈ చిత్రం విజయం సాధించింది.

ఆ త‌ర్వాత ఒక్క క్షణం సినిమా ఫ‌ట్ అవ్వ‌డంతో చాలా గ్యాప్ త‌ర్వాత ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా అయినా ‘ఏ బి సి డిస‌ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ చిత్రం కూడా శిరీష్‌కు విజ‌యాన్ని అందించ‌లేక‌పోయింది. మరోవైపు మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన హీరోలందరూ దూసుకుపోతుంటే అల్లు శిరీష్ మాత్రం ఇంకా వెనుకబడి పోయాడు. ఇంకా సరైన సక్సెస్ కోసం స్టార్ డమ్ కోసం పరుగులు పెడుతూనే ఉన్నాడు అల్లు శిరీష్. అయితే గీతా ఆర్ట్స్ కూడా సరైన దర్శకుడి వేట చాలా కాలం కొనసాగించింది.

ఎట్ట‌కేల‌కు ఒక తమిళ్ రీమేక్ కు ఫిక్స్ అయ్యాడు శిరీష్. 2018లో విడుదలై అక్కడి యూత్ ను ఆకర్షించిన ప్యార్ ప్రేమ కాదల్ చిత్ర రీమేక్ లో శిరీష్ నటించబోతున్నాడు. ఈ రీమేక్ ను డైరెక్ట్ చేసే బాధ్యతను రాకేష్ శశికు అప్పగించారు. ఈ దర్శకుడు కళ్యాణ్ దేవ్ హీరోగా విజేత చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. ఆ సినిమా ప్లాప్ అయినా కూడా.. గీతా ఆర్ట్స్ సంస్థ మ‌రియు అల్లు శిరీష్ రాకేష్ శశిపై ఆశ‌లు పెట్టుకున్నాడు. హిట్ డైరెక్ట‌ర్స్‌తో చేస్తేనే అల్లు శిరీష్ స‌క్సెస్ కాలేదు.. మ‌రి ప్లాప్ డైరెక్ట‌ర్‌తో చేస్తే స‌క్సెస్ అవుతాడా.. లేదా.. అన్న‌ది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news