అప్పుడు థియేటర్లలో.. ఇప్పుడు బుల్లితెరలో.. దూసుకుపోతోంది ‘ఉప్పెన’ లా

-

హీరో, హీరోయిన్, డైరెకట్ర్ ముగ్గురికీ మొదటి సినిమానే. భారీ బడ్జెట్ మూవీ కూడా కాదు. ఆవరేజ్ సినిమాగా తెరకెక్కింది. పెద్దగా అంచనాల్లేకుండా వచ్చింది. కానీ సునామీ సృష్టించింది. కలెక్షన్ల పరంగా పెద్ద హీరోల సినిమా రేంజ్ ను తలదన్నింది. 2021లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో కలెక్షన్ల పరంగా ఉప్పెన సినిమానేబిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు తాజాగా మరో క్రేజీ రికార్డును నమోదు చేసింది.

బుచ్చిబాబు డైరెక్షన్ లో వైష్ణవ తేజ్ హీరోగా కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన మూవీ ఉప్పెన. ఫిబ్రవరి 12న వచ్చిన ఈ సినిమా.. కొవిడ్ టైమ్ లోనూ రూ.100 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి ఔరా అనిపించింది. ఒక డెబ్యూ హీరోకు ఇండియాలో ఇదే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని ఇండస్ట్రీ పెద్దలు చెబుతున్నారు. అటు థియేటర్లలో దుమ్ములేపిన ఈ మూవీ ఇప్పుడు.. టీవీలో కూడా సంచలనం రేపింది.

థియేటర్స్ లో 50 రోజులు నడిచిన ఉప్పెన.. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లోనూ సత్తా చాటుతోంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ పేరుతో స్టార్ మాలో ఉప్పెనను టెలికాస్ట్ చేశారు మేకర్స్. ఇక్కడ అంచనాలను తలకిందులు చేస్తూ.. 18.5 రేటింగ్ సాధించి తనకు ఎదురు లేదని నిరూపించింది. ఒక్క సినిమాతోనే ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తున్న డైరెక్టర్, హీరో.. ముందు ముందు మరిన్ని రికార్డులు క్రియేట్ చేసేలా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news