బ్రేకింగ్: ఖమ్మం ఎన్నికలు కొంప ముంచినట్టే…?

ఒక పక్కన కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నా సరే ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించడంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలను నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పినా సరే కొన్ని కొన్ని చోట్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పోలింగ్ బూత్ ల వద్ద జనాలు భారీగా చేరుకున్నారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది.

అయితే ఖమ్మం నగరంలో మాత్రం జనాలు భారీగా ఓటు వేయడానికి వచ్చారు. కరోనా తీవ్రతను కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ లో మాత్రం జనాలు జాగ్రత్తగానే ఉన్నారు. ఖమ్మంలో మాత్రం ఒకరి మీద ఒకరు పడి ఓటు వేయడానికి రావడంతో ఎన్నికల సంఘంలో కూడా ఆందోళన మొదలయింది.