మనం ఎంతో కంఫర్టబుల్ గా ఉంటాం. మనకి 12 గంటలు ఉదయం అయితే మరో 12 గంటలు రాత్రి అవుతుంది. భూమి సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల ఇలా జరుగుతుంది అయితే కొన్ని ప్రదేశాలలో మాత్రం 24 గంటలు కూడా సూర్యుడి వెలుతురు ఉంటుంది.
ఆ ప్రదేశాలలో ఎప్పుడూ కూడా సూర్యుడు అస్తమించాడు. మరి అవేంటో ఈరోజు మనం చూద్దాం..! సూర్యాస్తమయం ఎప్పుడు అవ్వకుండా ఉంటే దానిని మిడ్నైట్ సన్ అంటారు. ఇది ఉత్తర ఆర్కిటిక్ మరియు దక్షిణ అంటార్కిటిక్ సర్కిల్లో అవుతుంది. అదికూడా వేసవి నెలల్లో.
నార్వే:
నార్వే ని లేండ్ అఫ్ మిడ్ నైట్ సన్ అని అంటారు. నార్వే లో హై ఆల్టిట్యూడ్ కారణంగా ఇది జరుగుతుంది. మే నుండి జూలై వరకు ఇక్కడ 76 రోజుల పాటు 20 గంటలు సూర్యాస్తమయం అవ్వదు.
ఫిన్లాండ్:
ఇక్కడ వేసవి కాలంలో 73 గంటల పాటు సూర్యాస్తమయం అవ్వదు. ఇక్కడ ఆరిజన్ కిందకి సూర్యుడు వెళ్లి మళ్ళీ సడన్ గా రైస్ అవుతాడు.
స్వీడన్:
మే మొదటి నుండి ఆగస్టు చివరి వరకు ఇక్కడ సూర్య కిరణాలు ఉంటాయి. అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది ఆ తర్వాత మరో సారి ఉదయం నాలుగు గంటలకు సూర్యోదయం అవుతుంది. ఇలా సూర్యకిరణాలు ఆరు నెలల పాటు ఉంటాయి.
అలస్కా:
మే చివరి నుండి జూలై చివరి వరకు ఇక్కడ సూర్యాస్తమయం అవ్వదు. సూర్యాస్తమయం
అర్ధరాత్రి పన్నెండున్నరకి ఎప్పుడో సూర్యాస్తమయం అవుతుంది.
ఐస్ ల్యాండ్:
ఇది యూరోప్ లో రెండవ అతిపెద్ద ఐలాండ్. మే మొదటి నుండి జూలై చివరి వరకు ఇక్కడ చీకటి ఉండదు. ఆర్కిటిక్ సమ్మర్ సమయంలో అర్ధరాత్రి సూర్యాస్తమయం అవుతుంది. మళ్లీ ఉదయం మూడు గంటలకి సూర్యోదయం అయిపోతుంది.
కెనడా:
వేసవిలో 50 రోజుల పాటు ఇక్కడ సూర్య కిరణాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో అయితే సంవత్సరమంతా కూడా స్నో తో నిండి పోతుంది.