డైమండ్స్ డ్రెస్ తో మెరిసిన ఊర్వ‌శి రౌతేలా.. ధ‌ర వింటే షాక్ అవ్వాల్సిందే

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఊర్వ‌శి రౌతేలా త‌న న‌ట‌న తో పాటు అందం తో చాలా మంది ప్రేక్ష‌కులను గెలుచుకుంది. అంతే కాకుండా బాలీవుడ్ లో ఎక్కువ పాపులారిటీ ఉన్న భామల‌లో ఊర్వ‌శి రౌతేలా ముందు ఉంటుంది. అయితే తాజాగా ఈ భామ ఫోటో ఒక్క‌టి సోష‌ల్ మీడియా లో వైర‌ల్ అవుతుంది. ఈ ఫోటో లో ఊర్వ‌శి రౌతేలా డైమండ్స్ తో కూడిన డ్రెస్ ను ధ‌రించి మెరుస్తుంది. కాగ ఇటీవ‌ల ఇజ్రాయిల్ లో జ‌రిగిన మిస్ యూనివ‌ర్స్ – 2021 పోటీల‌కు ఈ భామ జడ్జీ గా వ్య‌వ‌హ‌రించింది.

అయితే ఈ పోటీలు ముగిసిన అనంత‌రం భార‌త్ కు తిరిగి వ‌చ్చింది. ముంబై ఎయిర్ ఫోర్ట్ లో ఈ భామ క‌నిపించింది. అయితే ఊర్వ‌శి రౌతేలా ధ‌రించిన డ్రెస్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ గా నిలిచింది. ఈ డ్రెస్ డైమండ్స్ తో కూడి ఉంది. దీంతో ఫోటో గ్రాఫ‌ర్లు ఆమె చిత్రాన్ని క్లిక్ అనిపించారు. అయితే ఈ డ్రెస్ ధ‌ర రూ. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ట‌. ఇంత ధ‌ర తో ఉన్న డ్రెస్ ను చూసి అభిమానులు షాక్ అయ్యారు. ఇదిలా ఉండ‌గా.. ఈ భామ‌ డైమండ్స్ డ్రెస్ వేసుకున్న స‌మ‌యంలో చెవి దిద్దులు కూడా డైమండ్ తో నే ఉన్నాయి. కాగ ఈ ఫోటో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.