“ఉస్తాద్ భగత్ సింగ్” గ్లింప్స్ వీడియో రిలీజ్.. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోయింది

-

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎనర్జిటిక్ హీరోయిన్ శ్రీలీల ఈ సినిమాలో పవన్ కి జోడిగా నటిస్తుంది. ఈ మూవీ ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

అయితే తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. తాజాగా విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ” ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది” అని పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ ఈ వీడియో కి హైలైట్ గా నిలిచింది. ఈ అప్డేట్ తో పవన్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news