ఎన్టీఆర్ తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తి – బాలకృష్ణ

-

నందమూరి తారక రామారావు గారు తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తి అని అన్నారు నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బాలకృష్ణ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ ప్రజా జీవితంలోకి వచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని కొనియాడారు.

ఈ సందర్భంగా వైద్యరంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ సోమరాజు, కార్డియాలజిస్ట్ నాగేశ్వరరావు, జి ఎన్ కుమార్ కార్డియాలజిస్ట్, బి ఎన్ ప్రసాద్ ఆర్థోపెడిక్లను సన్మానించారు. అనంతరం బసవతారకం ఆసుపత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న వైద్య సేవలను వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news