వరుణ్ లుక్ అదుర్స్.. వాల్మీకి ప్రీ టీజర్ వచ్చేసింది..!

-

ఎఫ్2 బ్లాక్‌బస్టర్ కావడంతో వరుణ్ రేంజ్ కూడా పెరిగిపోయింది. అందుకే సినీ అభిమానులు వాల్మీకిపై అంచనాలు పెంచుకున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను రామ్, గోపి అచంట నిర్మిస్తున్నారు.

వరుణ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుంచే వచ్చినా.. తనకంటూ ఓ ప్రత్యేకతను, గుర్తింపును తెచ్చుకున్నాడు. తీసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రస్తుతం వరుణ్ తేజ్‌కు తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగే ఉంది. పెద్ద పెద్ద దర్శకులు కూడా వరుణ్‌తో సినిమా తీయడానికి క్యూ కడుతున్నారు. కంచె సినిమా నుంచి మొన్న వచ్చిన ఎఫ్2 దాకా ఆయన సినిమాలన్నీ వైవిధ్యంగానే ఉంటాయి. తాజాగా వరుణ్.. వాల్మీకి అనే సినిమాలో నటిస్తున్నాడు. హరీశ్ శంకర్ డైరెక్టర్. తమిళ మూవీ జిగర్తాండకు ఈ సినిమా రీమేక్. ఈ సినిమాలో వరుణ్ తేజ్ రోల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందట. ఇప్పటికే విడుదల అయిన వరుణ్ లుక్ వైరల్ అయింది. తాజాగా సినిమా ప్రీ టీజర్‌ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ప్రీ టీజర్‌లోనూ వరుణ్ లుక్ అదిరిపోయింది.

ఎఫ్2 బ్లాక్‌బస్టర్ కావడంతో వరుణ్ రేంజ్ కూడా పెరిగిపోయింది. అందుకే సినీ అభిమానులు వాల్మీకిపై అంచనాలు పెంచుకున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను రామ్, గోపి అచంట నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. తమిళం హీరో అథర్వ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 6న సినిమాను రిలీజ్ చేయడానికి మూవీ యూనిట్ ప్లాన్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news