బహిరంగంగా పొగ తాగుతూ ఎవరైనా కనిపిస్తే చాలు.. వాళ్లకు ఫైన్ వేస్తున్నారు. ఒకసారి ఫైన్ వేస్తారు. రెండోసారి అదే వ్యక్తి దొరికితే జైలు శిక్షే. దీనికి ఎవ్వరూ అతీతులు కాదు.. అని ఈరోజు నిరూపించారు.
సిగిరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టూ హెల్త్. ధూమపానం ఆరోగ్యానికి హానికరం.. అంటూ సినిమాల్లో ప్రకటనలు ఇస్తుంటారు కదా. అవి తాగితే ఆరోగ్యానికి హానికరం అని వాళ్లు చెప్పడం వరకేనా? పాటించేవాళ్లు ఎందరు ఉన్నారు. చివరకు ఈ ప్రకటనలు వేస్తున్న సినిమాల్లోని నటులు కూడా ధూమపానాన్ని మానలేకపోతున్నారు. సరే.. తాగితే తాగండి. కానీ.. బహిరంగ ప్రదేశాల్లో మాత్రం తాగకండి.. తాగితే ఫైన్ వేస్తాం అని ప్రభుత్వం చెబుతూనే ఉన్నది. అయినా కూడా బహిరంగంగా సిగిరెట్లు తాగడం మాత్రం మానడం లేదు. బహిరంగంగా సిగిరెట్ తాగడం వల్ల.. తాగే వ్యక్తికే కాదు.. అతడి పక్కన ఉన్న వ్యక్తికి కూడా సిగిరెట్ పొగ వల్ల ప్రమాదం ఉంటుందని.. అందుకే.. సిగిరెట్ తాగేవాళ్లు ప్రైవేటుగా తాగాలని ప్రభుత్వం, పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ.. వినేవాళ్లు ఎవ్వరూ లేరు.
అందుకే.. బహిరంగంగా పొగ తాగుతూ ఎవరైనా కనిపిస్తే చాలు.. వాళ్లకు ఫైన్ వేస్తున్నారు. ఒకసారి ఫైన్ వేస్తారు. రెండోసారి అదే వ్యక్తి దొరికితే జైలు శిక్షే. దీనికి ఎవ్వరూ అతీతులు కాదు.. అని ఈరోజు నిరూపించారు.
హీరో రామ్ కూడా ఇలాగే బహిరంగంగా పొగతాగుతూ పోలీసుల కంట పడ్డాడు. వెంటనే పోలీసులు ఆయనకు జరిమానా విధించారు. రామ్.. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ డైరెక్టర్. సినిమా షూటింగ్‌లో భాగంగా రామ్.. ఇవాళ చార్మినార్ వెళ్లాడు. అక్కడ షూటింగ్ అయిపోయాక.. బయటికి వచ్చి రోడ్డు మీద సిగిరెట్ తాగాడు. ఈ విషయం గమనించిన చార్మినార్ ఎస్సై పండరీ.. వెంటనే రామ్‌కు 200 రూపాయల ఫైన్ విధించారు. ఇంకోసారి బహిరంగంగా సిగిరెట్ తాగకూడదని హెచ్చరించారు.