ఆంబులెన్స్ ఎందుకండి.. నా కారు తీసుకెళ్లండి.. రోడ్డు ప్ర‌మాద బాధితుల‌తో ఏపీ మంత్రి అనిల్‌..!

-

సీఎం వైఎస్ జ‌గ‌న్ ఉండ‌వ‌ల్లిలోని ప్ర‌జావేదిక‌లో క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు నిర్వ‌హించ‌గా, ఆ స‌ద‌స్సుకు హాజ‌రు కావాల‌ని మంత్రి అనిల్ కారులో వెళ్తున్నారు. మార్గ‌మ‌ధ్య‌లో రోడ్డుపై ఓ యాక్సిడెంట్ జ‌రిగింది. దీంతో బాధితుల‌ను అనిల్ ప‌రామ‌ర్శించారు.

రోడ్డు ప్ర‌మాదం బారిన ప‌డి ఎవ‌రైనా రోడ్డుపైనే ఉండి తీవ్ర అవ‌స్థ ప‌డుతుంటే ఎవ‌రైనా స్పందిస్తారు. వారిని ఆసుప‌త్రికి త‌ర‌లిచేందుకు ఆంబులెన్స్‌కు ఫోన్ చేస్తారు. కానీ సొంత వాహ‌నంలో క్ష‌త‌గాత్రుల‌ను తీసుకెళ్లేందుకు చాలా మంది ముందుకు రారు. అయితే కొంద‌రు మాత్రం అలా కాదు. తాము ఎంత ఉన్న‌త స్థానంలో ఉన్న‌ప్ప‌టికీ తోటి వారికి స‌హాయం చేయాల‌నే గుణం వారికి మెండుగా ఉంటుంది. దీంతో వారు ఇత‌రుల కోసం ఏమైనా చేస్తారు. ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఉండ‌వ‌ల్లిలోని ప్ర‌జావేదిక‌లో క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు నిర్వ‌హించ‌గా, ఆ స‌ద‌స్సుకు హాజ‌రు కావాల‌ని మంత్రి అనిల్ కారులో వెళ్తున్నారు. మార్గ‌మ‌ధ్య‌లో రోడ్డుపై ఓ యాక్సిడెంట్ జ‌రిగింది. దీంతో బాధితుల‌ను అనిల్ ప‌రామ‌ర్శించారు. అయితే అప్ప‌టికే ఆంబులెన్స్‌కు ఫోన్ చేసినా.. అది వ‌చ్చేందుకు స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలుసుకున్న అనిల్ వెంట‌నే త‌న కారునిచ్చి క్ష‌త‌గాత్రుల‌ను అందులో త‌ర‌లించాల‌ని సూచించారు.

అయితే అప్ప‌టికి ఆంబులెన్స్ రావ‌డంతో ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారిని అందులో హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అయితే అనిల్ కుమార్ మాత్రం బాధితుల కోసం త‌న కారును ఇచ్చేందుకు సిద్ధ‌ప‌డ‌డంపై నెటిజ‌న్లు ఆయ‌న‌ను అభినందిస్తున్నారు. నిజంగా లీడ‌ర్ అంటే అలా ఉండాల‌ని, ఒక నాయ‌కుడు త‌న ప్ర‌జ‌ల కోసం ఏం చేయ‌డం కోస‌మైనా సిద్ధంగా ఉండాల‌ని అంద‌రూ అనిల్‌ను అభినందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అనిల్ ఆ సంఘ‌ట‌న‌లో ఉన్న ఫొటోలు ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి. ఏది ఏమైనా.. మంత్రి అనిల్ చొర‌వ‌ను నిజంగా అంద‌రం మ‌నస్ఫూర్తిగా అభినందించాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Latest news