వరుణ్-లావణ్య కాక్ టెయిల్ పార్టీలో మెగా హీరోస్.. అల్ట్రా స్టైలిష్ లుక్​లో అదుర్స్

-

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠిలు మరో 24 గంటల్లో వివాహ బంధంతో ఒక్కటవుతారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇటలీ చేరుకున్న ఈ జంట ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్​తో బిజీబిజీగా ఉంది. మరోవైపు వీరి వివాహానికి హాజరయ్యేందుకు ఇప్పటికే మెగా, అల్లు ఫ్యామిలీస్.. ఇతర బంధువులు, స్నేహితులు ఇటలీకి చేరుకున్నారు. ఇటలీలో జరగనున్న వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ మూడ్రోజుల పాటు ఘనంగా సాగనుంది.

ఇందులో భాగంగా అక్టోబర్ 30 రాత్రి.. కాక్‌టెయిల్స్ పార్టీతో వీరి వెడ్డింగ్ ఈవెంట్స్ షురూ అయ్యాయి. ఈ పార్టీకి మెగా, అల్లు ఫ్యామిలీ హీరోస్ అల్ట్రా పోష్ లుక్​లో వచ్చారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులు, అల్లు అర్జున్-స్నేహ దంపతులు క్రీమ్ అండ్ బ్లాక్ వెస్టర్న్ ఔట్ ఫిట్స్​లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో వరుణ్​, లావణ్య వైట్ కలర్ డ్రెస్​లో మెరిసిపోయారు

ఇక ఈరోజు హల్దీ, మెహందీ ఫంక్షన్స్ జరగనున్నాయి. వరుణ్‌, లావణ్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఈ ఫంక్షన్‌లో పాల్గొంటారు. ఇక నవంబర్ 1వ తేదీ ఈ జంట వివాహబంధంతో ఒక్కటవుతుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కాబోయే ఈ జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news