విజయ్ దేవరకొండ తర్వాత ఆ రేంజ్ కి వరుణ్..!

-

మెగా హీరో వరుణ్ తేజ్ ముకుందతో సిని కెరియర్ ప్రారంభించాడు. ఇంతమంది మెగా హీరోలు ఉన్నా సరే తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ ఏర్పరచుకున్న వరుణ్ తేజ్ ప్రయోగాలకు పెద్దపీట వేస్తున్నాడు. రీసెంట్ గా అంతరిక్షం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ఈ సంక్రాంతికి ఎఫ్-2తో పలుకరించాడు. విక్టరీ వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న వరుణ్ తేజ్ ఎఫ్-2తో సూపర్ హిట్ అందుకున్నాడు.

జనవరి 12న రిలీజైన ఈ సినిమా 11 రోజుల్లో 60 కోట్లు దాటేసింది. అయితే యువ హీరోల్లో 60 కోట్ల మార్క్ దాటేసిన హీరోగా విజయ్ దేవరకొండ ముందున్నాడు. గీతా గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ ఈ రేర్ ఫీట్ సాధించగా ఇప్పుడు ఎఫ్-2 తో వరుణ్ తేజ్ 60 కోట్లు రీచ్ అయ్యాడు. తన సినిమా సెలక్షన్స్ తో మెగా ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తున్న వరుణ్ తేజ్ ఇక ముందు కూడా ఇలాంటి సినిమాలు చేసి ఏకంగా 100 కోట్ల మార్క్ రీచ్ అవ్వాలని ఆశిస్తున్నారు మెగా ఫ్యాన్స్.

Read more RELATED
Recommended to you

Latest news