Gani Movie: గని ‘ ఈశ్వర్ నాథ్ ‘ లుక్ రిలీజ్

-

Gani Movie: వరుణ్ తేజ్ కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’ సినిమా రూపొందుతోంది. స్పోర్ట్స్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో డాగ్ ఎమోషనల్ లవ్ స్టోరీ తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాగా నవంబర్ 15న ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు మూవీ మేకర్స్.

ఈ నేపథ్యంలో.. సినిమాలోని ప్ర‌ధాన పాత్రల‌ను ప‌రిచ‌యం చేసింది మూవీ యూనిట్. వారి పాత్రల తాలూకు లుక్ ను రోజుకొకటి చొప్పున రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో నదియా ‘మాధురి’ పాత్రను పరిచయం చేస్తూ.. ఆమె లుక్ ను వదిలారు. తాజాగా జ‌గ‌ప‌తి బాబు పాత్ర‌ను రివీల్ చేసింది మూవీ యూనిట్.

జగపతిబాబు పోషించిన ఈశ్వర్ నాథ్ పాత్రను పరిచయం చేస్తూ.. నేడు ఆయన లుక్ ను రిలీజ్ చేశారు. శ్రీమంతుడు, ‘నాన్నకు ప్రేమతో లుక్స్ కి దగ్గరగా ఆయన లుక్ డీసెంట్ గా ఉంది. ఇక తెరపై ఆ పాత్ర స్వభావమేమిటనేది చూడాలి. ఇతర కీలక పాత్రల్లో సునీల్ శెట్టి .. ఉపేంద్ర కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాను డిసెంబర్ 3న థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news