ముచ్చటగా మూడోసారి వెంకీ – అనిల్ రావిపూడి కాంబో

-

టాలీవుడ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి, స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ కాంబోలో మరో సినిమా వస్తోంది. ఇప్పటికే ఈ కాంబినేషన్లో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు హ్యాట్రిక్ కొట్టేందుకు మరోసారి కలిసి పని చేస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ చిత్రబృందం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. దీన్ని దిల్‌రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం ఓ వీడియో గ్లింప్స్‌ ద్వారా ఈ చిత్ర విశేషాలు పంచుకుంది. హీరో.. అతని ఎక్స్ గర్ల్ఫ్రెండ్.. అద్భుతమైన భార్య.. ఈ మూడు ప్రధాన పాత్రల చుట్టూ అల్లుకున్న ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. ఇందులో వెంకీ మాజీ పోలీసు అధికారిగా కనిపించనున్నట్లు ప్రచార చిత్రాన్ని చూస్తే తెలుస్తోంది. ట్రై యాంగిల్‌ క్రైమ్‌ ఎంటర్‌టైనర్గా రానున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news