అందరికంటే ముందుగా రాబోతున్న వెంకీ మామ…..!!

విక్టరీ వెంకటేష్ మరియు అక్కినేని నాగచైతన్య ల తొలి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా వెంకీమామ. నిజ జీవితంలో మామ అల్లుళ్లయిన వెంకటేష్ మరియు చైతన్య ఈ సినిమాలో కూడా అవే పాత్రల్లో నటిస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి. ఇటీవల ఎన్టీఆర్ హీరోగా జైలవకుశ సినిమాతో మంచి హిట్ అందుకున్న బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్ మరియు సురేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

 

ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ మరియు రెండు లిరికల్ సాంగ్స్, శ్రోతలను విశేషంగా అలరించడంతో పాటు సినిమాపై అంచనాలు కూడా విపరీతంగా పెంచేయడం జరిగింది. ఈ సినిమాలో వెంకటేష్ ఒక పల్లెటూరి రైతుగా నటిస్తుండగా, నాగ చైతన్య సోల్జర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ కు జోడిగా పాయల్ రాజ్ పుత్, నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తున్న ఈ సినిమాను ఈనెల 13వ తేదీన గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక అధికారిక ప్రకటనను రిలీజ్ చేసింది. దగ్గుబాటి రానా మరియు ఈ సినిమా దర్శకుడు బాబీ కలిసి సినిమా రిలీజ్ డేట్ ని కొంత వినూత్నంగా అనౌన్స్ చేయడం జరిగింది.

నిజానికి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేద్దాం అని మొదట భావించారు. అయితే అప్పటికే పలు సినిమాలు రిలీజ్ డేట్స్ ని కన్ఫర్మ్ చేయడంతో, వాటితో పాటు రిలీజ్ చేసి రిస్క్ చేయడం ఇష్టం లేక ఈ సినిమాను ఈ నెలలోనే విడుదల చేయడానికి నిర్మాతలు నిశ్చయించారు. మరి తొలిసారిగా వెంకటేష్, నాగ చైతన్య కలిసి స్క్రీన్ పై సందడి చేయనున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని సాధిస్తుందో చూడాలి……!!