ఎఫ్-2 ‘రెచ్చిపోదాం బ్రదర్’ సాంగ్.. వెంకీ, వరుణ్ రెచ్చిపోయారుగా..!

-

హ్యాట్రిక్ డైరక్టర్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ఎఫ్-2. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ రెండు కలిపి చూపించే సినిమాగా ఈ సినిమా వస్తుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీ 2019 సంక్రాంతి 12న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా నుండి ఈమధ్య వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా ఇప్పుడు సినిమాలోని ఫస్ట్ సాంగ్ రెచ్చిపోదాం బ్రదర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది.

ఈ సాంగ్ చూసిన వారు సినిమా పక్కా హిట్ అనేస్తున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ ల కామెడీ హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ కు తమన్నా, వరుణ్ తేజ్ కు మెహ్రీన్ కౌర్ జంటగా నటిస్తున్నారు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ మూడు వరుస హిట్లు కొట్టిన అనీల్ రావిపుడి చేస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. సంక్రాంతి రేసులో ఆల్రెడీ చరణ్, బాలకృష్ణ ఫిక్స్ అవగా ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా ఎఫ్-2 సూపర్ ఎంటర్టైనర్ గా వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news