ఎఫ్-2 సెకండ్ సాంగ్.. ఎంతో ఫన్..!

-

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ సినిమాను అనీల్ రావిపుడు డైరెక్ట్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వ్నెకీ, వరుణ్ లకు జోడీలుగా తమన్నా, మెహ్రీ కౌర్ నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్ అవగా సినిమా నుండి సెకండ్ సాంగ్ ఎంతో ఫన్ అంటూ వచ్చేసింది.

వెంకటేష్, తమన్నాల మధ్య రొమాంటిక్ గా సాగే ఈ పాటని దేవి శ్రీ ప్రసాద్ పాడటం విశేషం. మెలోడీగా సాగిన ఈ పాటని శ్రీమణి రచించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈమధ్య రిలీజైన టీజర్ తో అంచనాలు పెంచిన ఎఫ్-2 రాబోయే సంక్రాంతికి పర్ఫెక్ట్ పండుగ తెచ్చే సినిమాగా ప్రచారం పొందుతుంది. మల్టీస్టారర్ సినిమాగా వస్తున్న ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. రీసెంట్ గా వరుణ్ తేజ్ అంతరిక్షం అంటూ ఓ ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

డిసెంబర్ 21న అంతరిక్షం రిలీజ్ అవగా జనవరి 12న ఎఫ్-2 రిలీజ్ అవుతుంది. అంటే 20 రోజుల తేడాలో వరుణ్ తేజ్ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్నమాట. అంతరిక్షం డివైడ్ టాక్ తెచ్చుకోగా ఎఫ్-2తో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు వరుణ్ తేజ్.

Read more RELATED
Recommended to you

Latest news