ఎఫ్-2 ట్రైలర్.. అరె మగాళ్లు మీరు మగళ్లురా భాయ్..!

-

విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ రెండు కలిపి వారిద్దరు చూపించే కామెడీకి అందరు కడుపుబ్బా నవ్వాల్సిందే అంటున్నారు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజరే డిఫరెంట్ గా అనిపించగా కొద్దిసేపటి క్రితం రిలీజైన ట్రైలర్ సినిమా మీద మరింత అంచనాలు పెంచింది.

సంక్రాంతి బరిలో సైలెంట్ కిల్లర్ గా ఈ సినిమా వస్తుందని చెప్పొచ్చు. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఎఫ్-2 అదరగొట్టడం ఖ్యామని తెలుస్తుంది. ఇక రిలీజైన ట్రైలర్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. భార్యా బాధుతులుగా వెంకటేష్, వరుణ్ తేజ్ నటన సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. సినిమాలో హీరోయిన్స్ గా తమన్నా, మెహ్రీన్ కౌర్ నటించారు. ఇక వీరి కష్టాలు విని కమెడియన్ ప్రియదర్శి అరే మగాళ్లు మీరు మగాళ్లురా భాయ్ అనేస్తాడు. మొత్తానికి అన్ని వయసుల వారిని అలరించే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంక్రాంతికి రాబోతున్న ఈ అళ్లుళ్ల హంగామా ఎలా ఉండబోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news