మహేష్ 360 డిగ్రీస్ అందంపై వెంకీ సెన్సేషనల్ కామెంట్స్..!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ అంటే అందరికి ఇష్టమే. ఎంతమంది స్టార్స్ ఉన్నా సరే తెలుగులో అందమైన హీరో అంటే అది మహేష్ ఒక్కడే. ఇదే విషయాన్ని మరోసారి గుర్తుచేశాడు విక్టరీ వెంకటేష్. మహేష్ నటించిన మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన వెంకటేష్ మహేష్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెంకటేష్ ఏమన్నాడు అంటే.. ప్రపంచాన్ని ఏలేస్తాడమ్మా మా మహేష్ బాబు.. ట్రైలర్ ఎలా ఉంది అదిరిపోయిందిగా.. మహేష్ బాబుకి ఇది 25వ సినిమా.. అయినా ఏజ్ మాత్రం 25 లానే ఉంటుంది.

ప్రతి ఆర్టిస్ట్ కు కెమెరా ఫేవర్ యాంగిల్ ఉంటుంది.. మహేష్ కు మాత్రం 360 డిగ్రీస్ కెమెరా ఎక్కడ పెట్టినా చాలా సూపర్ గా కబడతాడు.. అందుకే మేడం టుసాడ్స్ సింగపూర్ వారు తన స్టాట్యూని పెట్టారు.. కంగ్రాస్ మహేష్.. ఈ సినిమా మహేష్ కు.. యూనిట్ కు చాలా ముఖ్యమైంది.. ఆల్ ది బెస్ట్ ఫర్ మహర్షి.

నిర్మాతలు దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి.. మే 9కి మంచి సినిమా ప్రేక్షకులకు అందిస్తున్నారు. చిన్నోడు నా మీద కోపంగా పూల కుండీ తన్నాడు.. అలా తన్ని రికార్డులు బద్ధలు కొట్టగా ఇప్పుడు మళ్లీ ఈ సినిమాతో అన్ని రికార్డులు తన్నేయాలని కోరుతున్నా అని అన్నారు వెంకటేష్.

మహేష్ కూడా తన స్పీచ్ లో మా అన్నయ్య వెంకటేష్ గారు ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇండస్ట్రీలో తనకు బాగా నచ్చిన వ్యక్తి వెంకటేష్ గారు.. ఆయన ఈవెంట్ కు వస్తే సినిమా హిట్ అన్న సెంటిమెంట్ కూడా ఉంది. అందుకే ఆయన్ను స్పెషల్ గా ఇన్వైట్ చేశామని వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పాడు మహేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version