‘వరల్డ్ ఫేమస్ లవర్’ డైరెక్టర్ అడ్రస్ ఎక్కడ ? – ఫైర్ అవుతున్న దేవరకొండ ఫాన్స్ !!

వరుస ఫ్లాపులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. ఇటువంటి పరిస్థితుల్లో క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా ఫిబ్రవరి 14వ తారీఖున రిలీజ్ అయ్యింది. ప్రేమికుల రోజు సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా పై అంచనాలు విపరీతంగా పెట్టుకున్నారు అభిమానులు. కచ్చితంగా ఈ సినిమాతో అయినా విజయ్ దేవరకొండ హిట్ కొడతారని భావించారు. ఇదే సమయంలో మొట్టమొదటిసారి నలుగురు హీరోయిన్లతో విజయ్ దేవరకొండ యాక్ట్ చేయటంతో సినిమా పై ఇండస్ట్రీలో కూడా అంచనాలు నెలకొన్నాయి. Image result for ‘వరల్డ్ ఫేమస్ లవర్’

కానీ సినిమా రిలీజ్ అయిన మొట్టమొదటి రోజు మొదటి షోకే ఫ్లాప్ టాక్ రావడంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ గా నిరుత్సాహం చెందారు. స్టోరీ లో స్టోరీ లాగా సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ క్రాంతి మాధవ్ పై.., తెరకెక్కించిన విధానం పై ఫుల్ సీరియస్ అవుతున్నారు ఫ్యాన్స్.

 

ముఖ్యంగా సినిమాకి సంబంధించి సెకండాఫ్ భయంకరమైన రాడ్ టైపు లో ఉండటం సినిమాలో సాంగ్స్ కూడా సరిగా లేకపోవడంతో క్రాంతి మాధవ్ అడ్రస్ ఎక్కడ..? అసలు సినిమా తీయడం ఏంటి..? అంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. నలుగురు హీరోయిన్లు పెట్టి విజయ్ దేవరకొండ కెరీర్ నాశనం చేయడానికి సినిమా తీశాడా..? అంటూ ఫైర్ అవుతూ రెచ్చిపోతున్నారు. టోటల్ గా సినిమాకి ప్రజెంట్ ఉన్న టాక్ బట్టి చూస్తే కమర్షియల్ గా కూడా ఆడేలా లేదు అని ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు.