‘వరల్డ్ ఫేమస్ లవర్’ విడుదల కి కొద్ది గంటల ముందు బాంబు పేల్చిన విజయ్ దేవరకొండ !!

మరికొద్ది గంటల్లో విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా విడుదల కానుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా కి అద్భుతమైన రెస్పాన్స్ పబ్లిక్ లో ఉంది. సినిమా టీజర్ కి సోషల్ మీడియాలో అదిరిపోయే టాక్ వచ్చింది. అయితే విజయ్ దేవరకొండ ఎక్కడా కూడా అతిగా గత సినిమాల ప్రమోషన్ లో చేసినట్టుగా కాకుండా చాలా సైలెంట్ గా ఉన్నాడు.

Image result for world famous lover

గతంలో నటించిన సినిమాలు ప్రమోషన్ విషయాల్లో అతిగా అరుస్తూ కేకలు వేస్తూ సినిమాపై హైప్ వచ్చే విధంగా విజయ్ దేవరకొండ నానా హడావిడి చేసే వాళ్ళు. చివరకి సినిమా విడుదలయ్యాక అనుకున్నంత రిజల్ట్ రాకపోవడంతో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ యాంటీ ఫ్యాన్స్ భయంకరమైన ట్రోల్ చేయడం జరిగింది. ఒకానొక సమయంలో ఇది పెద్ద ఇష్యూ కూడా అయింది.

 

దీంతో ఈసారి రాబోతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా విషయంలో మాత్రం హడావిడి లేకుండా సైలెంట్ హిట్ కొట్టాలని విజయ్ దేవరకొండ అనుకుంటున్నాడట. అయితే సినిమాకి సంబంధించి ఎటువంటి హడావుడి ప్రస్తుతం లేకపోవడంతో మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న నేపథ్యం లో ఈ సినిమా టికెట్ రేటు పెంచాలని విజయ్ దేవరకొండ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో సినిమా చూడాలని ఆతృత పడుతున్న అభిమానులకు సినిమా ప్రేక్షకులకు బాంబు పేలినట్లు అయ్యింది.