Balakrishna: బాల‌య్య షోలో సంద‌డి చేయ‌నున్న రౌడీ హీరో!

-

Balakrishna: నందమూరి బాల‌కృష్ణ డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఎన్నో యేండ్లుగా వెండి తెర మీద సంద‌డి చేసిన బాల‌య్య‌.. ఓటీటీ వేదికగా హోస్టింగ్ చేస్తున్నారు. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ మాధ్య‌మ‌మైన ఆహాలో బాల‌య్య అన్‌స్టాప‌బుల్ అనే టాక్‌షో కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బాల‌య్య‌కు త‌గ్గ‌ట్టుగానే షోని డిజైన్ చేశారు. ప్ర‌ముఖ సినీ తారలను పిలిచి ఇంటర్య్వూ చేస్తున్నారు. దీపావ‌ళి కానుక‌గా తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేశారు. మంచు ఫ్యామిలీ పాల్గొన్న ఈ ఎపిసోడ్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది.

ఆ త‌రువాత‌ రెండో ఎపిసోడ్ లో నేచురల్ స్టార్ నాని పిలిచారు. దీంతో ఈ షో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ షో వల్ల ఆహా ‘ఆహా’ సబ్‌స్క్రైబర్లు కూడా చాలా మంది అయ్యారు. ఈ క్ర‌మంలో మ‌రో చ‌ర్చ ప్రారంభ‌మైంది. మూడో గెస్ట్ గా ఎవ్వ‌రూ కానున్నారనే ఆస‌క్తి నెట్టింట్లో ప్రారంభ‌మైంది. తాజా సమాచారం ప్రకారం.. మూడో ఎపిసోడ్ కి గెస్ట్ గా విజయ్ దేవరకొండను తీసుకొస్తున్నారట. బాలయ్యతో విజయ్ కి మంచి అనుబంధమే ఉంది. బాలయ్యకు సన్నిహితుడైన పూరి జగన్నాథ్‌తో ప్రస్తుతం విజయ్ ‘లైగర్’ చేస్తున్న సంగతి తెలిసిందే.

రౌడీ హీరోతో బాల‌య్య ఎలా సంద‌డి చేశారు. ఎలాంటి ప్ర‌శ్న‌లు వేస్తార‌నే ఆస‌క్తి యూత్ ఈ షో అభిమానుల్లో పెరిగింది. త్వ‌ర‌లోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news